Steve Smith: స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. చూసితీరాల్సిన వీడియో ఇది..
ABN , Publish Date - Dec 17 , 2024 | 02:21 PM
Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో అలరించాడు. స్లిప్స్‌లో అతడు బంతిని పట్టుకున్న విధానం హైలైట్ అనే చెప్పాలి.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మల్టీటాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. కంగారూ టీమ్‌లోకి తొలుత స్పిన్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చాడతను. ఆ తర్వాత బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపర్చుకొని ఈ స్థాయికి చేరుకున్నాడు. బౌలింగ్‌ను పూర్తిగా పక్కనబెట్టి బ్యాటింగే ప్రధానంగా చేసుకొని తోపు ప్లేయర్‌గా ఎదిగాడు. అయితే అవసరమైన సమయంలో బంతితోనూ అతడు మ్యాజిక్ చేయగలడు. ఈ రెండే కాదు.. ఫీల్డింగ్‌లోనూ స్మిత్ తోపే. తాజాగా అది మరోమారు ప్రూవ్ చేశాడు.
పక్కా లెక్కతో పట్టేశాడు
గబ్బా వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో స్మిత్ ఓ థ్రిల్లింగ్ క్యాచ్‌తో మెస్మరైజ్ చేశాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారత స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ కట్ షాట్ కొట్టాడు. అయితే బాల్ బౌన్స్‌ను అంచనా వేసి సరిగ్గా కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అంతే బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్స్‌లోకి దూసుకెళ్లిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న స్మిత్ సూపర్బ్‌గా పట్టేశాడు. తనకు దూరంగా వెళ్తున్న బంతిని దాని వేగాన్ని పక్కాగా అంచనా వేసి అందుకున్నాడు. రెప్పపాటులో శరీరాన్ని దాని దగ్గరకు తీసుకెళ్లి అమాంతం డైవ్ చేసి పట్టేశాడు. ఈ క్యాచ్ తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read:
జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది
బచ్చా బౌలర్ డబుల్ హ్యాట్రిక్.. తోపుల వల్ల కానిది సాధించాడు
ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ మధ్యలోనే..
ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..
For More Sports And Telugu News