Travis Head: బుమ్రాను భయపెట్టిన హెడ్.. ఇలాంటి షాట్ ఎప్పుడూ చూసుండరు
ABN , Publish Date - Dec 15 , 2024 | 11:19 AM
Travis Head: టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అంటే బ్యాటర్లు భయపడతారు. అతడి బౌలింగ్‌లో పరుగులు రాకపోయినా ఫర్వాలేదు.. వికెట్లు పడకపోతే అదే పదివేలని అనుకుంటారు. బ్యాటర్లకు బుమ్రా అంటే అంత వణుకు. కానీ అలాంటి పేసుగుర్రాన్ని ఒకడు భయపెట్టాడు.
IND vs AUS: టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అంటే బ్యాటర్లు భయపడతారు. అతడి బౌలింగ్‌లో పరుగులు రాకపోయినా ఫర్వాలేదు.. వికెట్లు పడకపోతే అదే పదివేలని అనుకుంటారు. బ్యాటర్లకు బుమ్రా అంటే అంత వణుకు. కానీ అలాంటి పేసుగుర్రాన్ని ఒకడు భయపెట్టాడు. వినూత్నమైన షాట్లతో అతడిపై అటాక్ చేశాడు. పేస్, స్వింగ్‌కు భయపడకుండా బ్యాటింగ్ చేస్తూ బుమ్రాకు ముచ్చెమటలు పట్టించాడు. అతడే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. గబ్బా టెస్ట్‌లో భారత పేసర్‌ను టార్గెట్ చేసుకొని రెచ్చిపోయాడతను.
టైమింగ్ అదిరింది
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన హెడ్.. గబ్బా టెస్ట్‌లోనూ పంజా విసిరాడు. భారీ సెంచరీతో భారత్ మీద తుఫానులా విరుచుకుపడ్డాడు. 115 బంతుల్లో మూడంకెల మార్క్‌ను చేరుకున్న హెడ్.. టీమిండియా బౌలర్లందర్నీ బాదిపారేశాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో కొట్టిన ఓ ర్యాంప్ షాట్ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆఫ్ సైడ్ వేసిన బౌన్సర్‌ను కాస్త వంగి బ్యాట్‌తో స్వీట్ టచ్ ఇచ్చాడు ఆసీస్ బ్యాటర్. అంతే స్లిప్స్ మీదుగా సిక్స్‌కు దూసుకెళ్లిందా బంతి. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్ ఎప్పుడూ చూడని ఆడియెన్స్.. చప్పట్లతో అతడ్ని ఎంకరేజ్ చేశారు. కాగా, ఈ టెస్ట్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు ప్రస్తుతం 3 వికెట్లకు 276 పరుగులతో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (86 నాటౌట్), ట్రావిస్ హెడ్ (123 నాటౌట్) క్రీజులో ఉన్నారు.