IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 359
ABN , Publish Date - Oct 26 , 2024 | 11:21 AM
lన్యూజిలాండ్ ను 255 పరుగుల వద్ద కట్టడి చేయడంలో భారత్ సఫలమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ కోసం టీమిండియా ముందు 359 పరుగుల లక్ష్యం ఉంది.
పూణె: పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. భారత్ న్యూజిలాండ్ జట్టును రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకే పరిమితం చేసింది. దీంతో టీమిండియా 359 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది. భారత్ తరపున తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్‌తో పాటు అశ్విన్ (2 వికెట్లు), జడేజా (3 వికెట్లు) కూడా అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించారు. జైస్వాల్, రోహిత్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు.
మూడో రోజు టామ్ బ్లండెల్ (41 పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేసి వికెట్లు తీసే ప్రక్రియను జడేజా ప్రారంభించాడు. ఆ తర్వాత అశ్విన్, జడేజా, సుందర్‌లు తమ స్పిన్నింగ్ మాయాజాలంతో బ్యాట్స్ మెన్‌లపై చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ పరుగులకు అడ్డుకట్ట పడింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ జట్టు 69.4 ఓవర్లలో 255 మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇప్పుడు భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే 359 పరుగుల లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది.