Share News

IND vs NZ: అలా ఎలా ఒప్పించావ్ భయ్యా.. సర్ఫరాజ్ రివ్యూ అదుర్స్

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:30 PM

రోహిత్ ను కన్విన్స్ చేసి రివ్యూకు వెళ్లేలా చేసిన సర్ఫరాజ్ పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

IND vs NZ: అలా ఎలా ఒప్పించావ్ భయ్యా.. సర్ఫరాజ్ రివ్యూ అదుర్స్
IND VS NZ Match

పూణె: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వికెట్ కోసం డీఆర్ఎస్ సమీక్షకు వెళ్లాలా వద్దా అని రోహిత్ శర్మ సందేహిస్తున్న సమయంలో సర్ఫరాజ్ కెప్టెన్ ను కన్విన్స్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ’రోహిత్ భాయ్ నా మీద నమ్మకం ఉంచు మనం రివ్యూకు వెళ్తున్నాం‘ అంటూ సర్ఫరాజ్ పట్టుబడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది.


24వ ఓవర్ ఆఖరి బంతిని రవిచంద్రన్ అశ్విన్ లెగ్ సైడ్ దిశగా వేయడంతో విల్ యంగ్ దాన్ని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే విల్ బ్యాట్-గ్లవ్స్‌కు అతి దగ్గరగా వెళ్లిన బంతిని వికెట్ల వెనుక ఉన్న పంత్ అందుకున్నాడు. ఔట్‌గా అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీనిపై పంత్ సహా అక్కడున్న వారెవ్వరూ రివ్యూకు వెళ్లకపోవడమే బెటరేమో అనే సందిగ్దంలో ఉన్నారు. యితే ఇది కచ్చితంగా ఔట్ అని, రివ్యూకి వెళ్లాలని షార్ట్ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్ రోహిత్‌ను కోరాడు. ఆఖరికి సర్ఫరాజ్ మాటలే నిజమై భారత్ కు ఒక వికెట్ లభించింది. దీంతో ఈ యంగ్ ప్లేయర్ జడ్జిమెంట్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

IND vs NZG: కివీస్‌తో మ్యాచ్.. అశ్విన్ పేరిట వరల్డ్ రికార్డ్

Updated Date - Oct 24 , 2024 | 02:28 PM