Share News

India Vs South Africa: మందాన సెంచరీ.. దక్షిణాఫ్రికాపై ఇండియా విక్టరీ

ABN , Publish Date - Jun 16 , 2024 | 08:41 PM

దక్షిణాఫ్రికా ఉమెన్స్- ఇండియా ఉమెన్స్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగమైన ఆరంభ పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

India Vs South Africa: మందాన సెంచరీ.. దక్షిణాఫ్రికాపై ఇండియా విక్టరీ

బెంగళూరు: దక్షిణాఫ్రికా ఉమెన్స్- ఇండియా ఉమెన్స్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగమైన ఆరంభ పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ స్మృతి మందాన అద్భుతమైన శతకం, స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ రాణించడంతో భారత్ ఈ స్థాయి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది.


స్మృతి మందాన దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీని నమోదు చేసింది. దక్షిణాఫ్రికాపై 127 బంతులు ఎదుర్కొన్న మందాన 117 పరుగులు బాదింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా చూస్తే భారత్‌కు ఇది రెండవ అతిపెద్ద విజయంగా నమోదైంది. ఇక భారత గడ్డపై ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. భారత బౌలర్లలో స్పిన్నర్ ఆశా శోభనా 4 వికెట్లు తీయగా.. దీప్తి 2 కీలకమైన వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. అద్భుత సెంచరీ చేసిన స్మృతి మందానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

Updated Date - Jun 16 , 2024 | 08:41 PM