Vaibhav Suryavanshi: వైభవ్‌పై కాంట్రవర్సీ.. ఐపీఎల్‌లో ఫ్రాడ్ అంటూ ఆరోపణలు.. స్పందించిన తండ్రి
ABN , Publish Date - Nov 26 , 2024 | 02:47 PM
పదమూడేళ్లకే ఐపీఎల్ మెగా వేలంలో కోటికి పైగా జాక్ పాట్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ వయసుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వైభవ్ తండ్రి దీనిపై స్పందింస్తూ..
ఢిల్లీ: తన కొడుకు పదేళ్లప్పుడు క్రికెటర్ కావాలనే అతడి కలను నెరవేర్చేందుకు తన పంటభూమిని సైతం అమ్మేసినట్టు వైభవ్ సూర్యవంశీ తండ్రి వెల్లడించాడు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ బుడతడి పేరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. 13 ఏళ్ల 8 నెలల వయసున్న వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా ఒక కోటి 10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కుర్ర క్రికెటర్ పేరు మర్మోగిపోయింది. అయితే, ఇప్పుడే అసలు కథ మొదలైంది. వైభవ్ వయసు 13 ఏళ్లు కాదని.. 15 ఏళ్ల్ంటూ పలు ఆరోపణలు రావడంతో ఈ క్రికెటర్ తండ్రి స్పందించాడు.
వైభవ్ అసలు వయస్సు 15 సంవత్సరాలు అని చాలా మంది అంటున్నారు. కానీ, అతడికి ఎనిమిదిన్నర సంవత్సరాల వయసున్నప్పుడే మొదటిసారి బీసీసీఐ అతడికి ఎముక పరీక్ష(ఎముకల ద్వారా వయసును తెలిపే పరీక్ష)కు హాజరయ్యాడు. అతను ఇప్పటికే భారత్ తరఫున అండర్-19 ఆడాడు. మేము ఎవరికీ భయపడము. అవసరమైతే మరోసారి ఈ పరీక్షలు చేయిస్తాము. 13 ఏళ్ల వయసులో కోటి సంపాదించడం అంటే ఏమిటో కూడా నా కొడుక్కి తెలియదు. డబ్బుల కోసం మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇలాంటి చర్చలకు వాడిని దూరంగా ఉంచాలని కోరుతున్నాం. ఒకప్పుడు వాడికి డోరెమాన్ అంటే ఇష్టం ఇప్పుడు క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియదు అంటూ వైభవ్ తండ్రి సంజీవ్ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ వేలంలో వైభవ్ బేస్ ప్రైజ్ నిజానికి రూ.30 లక్షలే. కానీ.. రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కూడా పోటీపడటంతో మంచి ధర పలికాడు. అయితే పోటీ నెలకొన్నా రాజస్థాన్ మాత్రం పట్టు వీడలేదు. ఆఖరుకు కోటీ పది లక్షలు చెల్లించి అతడ్ని దక్కించుకుంది. దీంతో వచ్చే ఏడాది సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఈ యంగ్ బ్యాటర్ ఐపీఎల్‌లో ఆడనున్నాడు.