Share News

IPL 2025 LSG: పాపం రాహుల్.. వదిలించుకునే ప్లాన్ లో లక్నో

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:33 AM

గత మూడు సీజన్ల నుంచి రాహుల్ లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్ లో లక్నో చెత్త ప్రదర్శనతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ కారణాల వల్లే రాహుల్ ను రిటైన్ చేసుకునే ఆలోచనను లక్నో జట్టు పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

IPL 2025 LSG: పాపం రాహుల్.. వదిలించుకునే ప్లాన్ లో లక్నో
KL Rahul

ముంబై: కేఎల్ రాహుల్ అభిమానులకు లక్నో సూపర్ గెయింట్స్ షాకింగ్ న్యూస్ వినిపించనుంది. రాహుల్ ను విడుదల చేసి ఆక్షన్ కు పంపే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. పూర్ ఫామ్ కారణంగా కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఈ క్రికెటర్ స్ట్రైక్ రేట్ పట్ల మేనేజ్‌మెంట్ కూడా సంతోషంగా లేదని తెలుస్తోంది. గత మూడు సీజన్ల నుంచి రాహుల్ లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్ లో లక్నో చెత్త ప్రదర్శనతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ కారణాల వల్లే రాహుల్ ను రిటైన్ చేసుకునే ఆలోచనను లక్నో జట్టు పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఫాస్ట్ బౌలర్స్ మయాంక్ యాదవ్, నికోలస్ పురాన్, రవి బిష్ణోయ్‌లను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి లక్నో సిద్ధంగా లేదు. ఇంకాస్త అనుభవం తోడైతే మయాంక్ లక్నో భవిష్యత్తును నిలబెట్టే ఆటగాడిగా మారతాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.


రాహుల్ ఉద్వాసనకు ఇవే కారణాలు..

ఐపీఎల్ 2022లో రాహుల్ మొత్తం 15 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో ఒక సెంచరీ సహాయంతో 616 పరుగులు నమోదుచేశాడు. అతని స్ట్రైక్ రేట్ 135.38గా ఉంది. 2023లో 9 మ్యాచ్‌లు ఆడి 274 పరుగులు చేశాడు. అప్పుడు స్ట్రైక్ రేట్ 113.22గా ఉంది. ఈ సీజన్‌లో కేవలం 4 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. దీని తర్వాత 2024లో 14 మ్యాచ్‌లు ఆడి 520 పరుగులు చేశాడు. ఇక్కడ స్ట్రైక్ రేట్ 136.12గా నమోదైంది. అతని స్ట్రైక్ రేట్ పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ ఏమాత్రం సంతోషంగా లేదు. ఆట వేగానికి రాహుల్ స్ట్రైక్ రేట్ కు పొంతన లేకుండా ఉందని మేనేజ్మెంట్ పెదవి విరుస్తున్నట్టుగా తెలుస్తోంది. రిటెన్షన్ లిస్ట్‌లో బిష్ణోయ్ కంటే ముందున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఐపిఎల్ వర్గాలు తెలిపాయి.


పంత్ కోసం క్యూ కడుతున్నారు..

మరోవైపు రిషభ్ పంత్ ను రిటైన్ చేసేందుకు జట్లు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ వదులుకుంటే గనుక వెంటను ఎంత ఖర్చు చేసి పంత్ ను దక్కించుకోవచ్చనే లెక్కలు ఇప్పుడే వేసుకుంటున్నారు. LSG మరియు పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు తమ కెప్టెన్సీ అభ్యర్థిగా పంత్‌ను నియమించాలని చాలా ఆసక్తిగా ఉన్నాయి. మరికిన్ని జట్టు కూడా పంత్ కోసం క్యూ కట్టాయి.

భారత పతక వేటకు విఘాతం

Updated Date - Oct 23 , 2024 | 11:33 AM