MI vs RCB: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - Apr 11 , 2024 | 07:11 PM
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లూ పేలవంగానే రాణిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల సంఖ్యను పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ పడింది.
ముంబై: ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లూ పేలవంగానే రాణిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల సంఖ్యను పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ పడింది. ఆతిథ్య జట్టు ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్సీ అప్పగించాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్- రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, జెరాల్డ్ కొయెట్జీ, ఆకాశ్ మధ్వల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్), మహిపాల్ లోమ్రోర్, రీస్ టాప్లీ, విజయ్‌కుమార్ వైశాక్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్