Share News

CSK vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ABN , Publish Date - May 12 , 2024 | 03:19 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్ఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.

CSK vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్ఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు టాప్-4లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రెండో స్థానంలో ఉండగా.. చెన్నై నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే.. అది ప్లేఆఫ్స్‌లో తన బెర్తుని అధికారికంగా ఖాయం చేసుకుంది. అదే చెన్నై గెలిస్తే.. ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. కానీ.. ఓడితే మాత్రం నాకౌట్ దశకు చేరుకోవడం కష్టంగా మారుతుంది. ఈ లెక్కన.. రాజస్థాన్ కన్నా ఈ మ్యాచ్ చెన్నైకి ఎంతో కీలకమైంది.


కాగా.. ఈ ఇరు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ మొత్తం ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెన్నై 15, రాజస్థాన్ 13 విజయాలను నమోదు చేశాయి. అంటే.. రెండు మ్యాచ్‌ల తేడాతో చెన్నై ఆధిపత్యం చెలాయిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే.. ఈ సీజన్‌లో చెన్నైతో పోలిస్తే రాజస్థాన్ జట్టు మరింత పటిష్టంగా ఉంది. విజయాల పరంగా అది దూసుకెళ్తోంది. కానీ.. గత రెండు మ్యాచ్‌ల్లో మాత్రం అది పరాజయాల్ని చవిచూసింది. దీంతో.. చెన్నైతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బౌన్స్ బ్యాక్ ఇచ్చి.. ప్లేఆఫ్స్‌లో తన బెర్తుని ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరి.. హోరాహోరీగా సాగనున్న ఈ పోరులో ఎవరు విజయా సాధిస్తారో చూడాలి.

తుది జట్లు

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్‌ దూబె, ధ్రువ్‌ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్‌ శర్మ, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహీశ్‌ తీక్షణ

Updated Date - May 12 , 2024 | 03:19 PM