Share News

KL Rahul: కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..

ABN , Publish Date - Oct 29 , 2024 | 07:32 AM

కేఎల్ రాహుల్‌‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ నిలుపుదల చేసుకుంటుందా లేదా అనే సందేహాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. వ్యక్తిగతంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో పాటు జట్టును నడిపించడంలో కూడా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ విషయంలో యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..
KL Rahul

టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జట్టు నుంచి విడుదల చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే రాహుల్ మెగా వేలంలో అందుబాటులో ఖాయం. నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ ఈ ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీ రిటెయిన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. యువ ఆటగాళ్లు మొహిసిన్ ఖాన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆయుష్ బదోనీలను కూడా రిటెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.


కాగా కేఎల్ రాహుల్‌‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ నిలుపుదల చేసుకుంటుందా లేదా అనే సందేహాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. వ్యక్తిగతంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో పాటు జట్టును నడిపించడంలో కూడా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ విషయంలో యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. అతడిని జట్టు నుంచి విడుదల చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్టు చాలా రోజులుగా ఊహాగానాలు వెలుడుతున్నాయి. అయితే ఇటీవల యాజమాన్యంతో జరిగిన భేటీలో టీమ్‌లో కొనసాగడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదంటూ రాహుల్ చెప్పినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడిని విడుదల చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31 లోగా వెల్లడించాల్సి ఉంది. కాబట్టి ఈలోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.


కెప్టెన్‌గా నికోలస్ పూరన్

ఐపీఎల్ 2025 సీజన్‌లో జట్టు పగ్గాలను వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌కు అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు కెప్టెన్సీ రేసులో పూరన్ ముందు వరసలో ఉన్నాడని ఎల్‌ఎస్‌జీ వర్గాలు చెబుతున్నాయి. పూరన్‌పై పూర్తిస్థాయి నమ్మకం ఉంచడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు ఎల్‌ఎస్‌జీ వర్గాలు మీడియాతో అన్నాయి. ‘‘నిరుడు కూడా పూరన్ కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. వెస్టిండీస్ జాతీయ జట్టుకు కూడా సారథిగా కూడా వ్యవహరిస్తున్న అతడికి అపారమైన అనుభవం ఉంది. అందుకే పూరన్ నైపుణ్యాలపై విశ్వాసం కొనసాగించాలనుకుంటున్నాం. పూరన్‌తో పాటు పేసర్ మయాంక్ యాదవ్‌, రవి బిష్ణోయ్‌లను కూడా కొనసాగిస్తాం’’ అని ఫ్రాంచైజీకి చెందిన సన్నిహిత వ్యక్తి ఒకరు మీడియాతో అన్నారు.


కాగా వెస్టిండీస్‌కు చెందిన పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ లక్నో జట్టుకు ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్ 2023లో సీజన్‌లో కేఎల్ రాహుల్ అందుబాటులో లేని సమయంలో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కాగా గత సీజన్‌లో పూరన్ ఏకంగా రూ.16 కోట్ల ధర పలికాడు. 2017లో ముంబై ఇండియన్స్‌ అతడిని కేవలం రూ.30 లక్షలకే సొంతం చేసుకుంది. తన పవర్ హిట్టింగ్‌లో సత్తా చాటడంతో అనతికాలంలోనే చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఇవి కూడా చదవండి

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

24 ఏళ్లలో తొలిసారి.. టీమిండియాకు చెత్త రికార్డు ముప్పు

ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే

For more Viral News and Telugu News

Updated Date - Oct 29 , 2024 | 11:10 AM