Share News

Rishabh Pant: అన్ని కోట్లు పోసి కొని.. పంత్‌ను కెప్టెన్ చేయరా.. లక్నో జట్టు అసలు ప్లాన్ ఇదేనా..

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:46 AM

ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర పలికిన పంత్ లక్నో జట్టుకు కెప్టెన్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ పంత్ ఫ్యాన్స్ ను ఇంతకాలం ఊరించిన లక్నో జట్టు ఇప్పుడు ఉసూరుమనిపించింది.

Rishabh Pant: అన్ని కోట్లు పోసి కొని.. పంత్‌ను కెప్టెన్ చేయరా.. లక్నో జట్టు అసలు ప్లాన్ ఇదేనా..
Rishabh pant

ముంబై: రికార్డు బ్రేకింగ్ ధరకు రిషభ్ పంత్ ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అభిమానులకు షాకుల మీద షాకులిచ్చింది. పంత్ కు రూ. 27 కోట్ల భారీ ధరను చెల్లించడంతో పాటు 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సైతం కోటికి పైగా చెల్లించి జట్టులోకి తీసుకుంది. ఇప్పుడు లక్నో జట్టు తన అసలు ప్లాన్ ను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జట్టులో అందరికన్నా ఖరీదైన ప్లేయర్ పంత్ కావడంతో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే దక్కుతాయని అంతా భావించారు. కానీ ఈ జట్టు తాజా వైఖరి చూస్తుంటే అందుకు భిన్నంగా ఉంది.


పంత్ కు బదులుగా పొట్టి ఫార్మాట్ లో వెస్టిండీస్ తరఫున అదరగొడుతున్న నికోలస్ పూరన్ జట్టుకు సారథిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా లక్నో జట్టు తమ ప్లేయర్లకు సంబంధించిన ఓ వీడియో మీమ్ ను పంచుకుంది. ఇందులో బాలీవుడ్ పాపులర్ సినిమా ‘హమ్ సాథ్ సాథ్ హై’ పాటను ప్లే చేస్తూ తమ జట్టులో ముఖ్యమైన ప్లేయర్‌గా నికోలస్ పూరన్ ను పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో పంత్‌ను ప్రత్యేకమైన ప్లేయర్ గా తెలిపింది. ఇది చూసిన పంత్ అభిమానులు కంగారు పడుతున్నారు. పంత్ తో పాటు నికోలస్ కూడా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావడం విశేషం. వెస్టిండీస్ విధ్వంసకారుడిగానూ అతడికి పేరుంది. ఇక ఇద్దరిలో కెప్టెన్ పగ్గాలు చేపట్టేది ఎవరనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Prithvi Shaw: ఆ మీమ్స్ చూసి బాధపడ్డా.. ట్రోలింగ్ పై పృథ్వీ షా వీడియో వైరల్


Updated Date - Nov 27 , 2024 | 11:47 AM