Team India: గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్.. ఇలా రివర్స్ అయిందేంటి
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:43 PM
Team India: సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోరులో మున్ముందు జరిగే సిరీస్‌ల్లోనూ అదరగొట్టాలని అనుకుంటోంది. ఈ తరుణంలో జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
IND vs AUS: సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోరులో మున్ముందు జరిగే సిరీస్‌ల్లోనూ అదరగొట్టాలని అనుకుంటోంది. ప్రొటీస్‌ను వాళ్ల సొంతగడ్డపై చిత్తుచిత్తుగా ఓడించడంతో హ్యాపీగా ఉంది. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లాంటి వాళ్లు ఇరగదీయడం.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ దుమ్మురేపడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో వచ్చిన విమర్శలు, ఒత్తిడిని తాజా టీ20 సిరీస్ విజయంతో కొంతవరకు పోగొట్టింది టీమిండియా. ఇదే జోరును ఇక మీదట కొనసాగించి ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఫుల్ డామినేట్ చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
వేలికి గాయం
ఆస్ట్రేలియాతో త్వరలో మొదలయ్యే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మళ్లీ కైవసం చేసుకునేందుకు కంగారూ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా క్రికెటర్లు గత కొన్ని రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. లాంగ్ ఫార్మాట్‌లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే భారత జట్టుకు బిగ్ షాక్ తగిలిందని తెలుస్తోంది. యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు గాయమైందని సమాచారం. బ్యాటింగ్ సాధన చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి ఇంజ్యురీ అయిందట. నవంబర్ 22న మొదలయ్యే తొలి టెస్ట్ వరకు అతడు కోలుకుంటాడో లేదో ఎలాంటి సమాచారం లేదు.
ఎవరికి ఛాన్స్?
కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్‌కు అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. అతడికి కుమారుడు జన్మించడంతో ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నాడు హిట్‌మ్యాన్. దీంతో పెర్త్ టెస్ట్‌లో అతడి స్థానంలో ఎవర్ని రీప్లేస్ చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్‌లో ఒకరు ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు జతగా గిల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయని అంటున్నారు. ఈ తరుణంలో అతడు గాయపడటం టీమ్ మేనేజ్‌మెంట్‌కు బిగ్ షాక్ అనే చెప్పాలి. అయితే గిల్ గాయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి దీనిపై బోర్డు నుంచి సమాచారం వచ్చే దాకా ఏదీ చెప్పలేం. అయితే గిల్ త్వరగా కోలుకోవాలని, అతడు బ్యాట్ పట్టి ఇరగదీయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read:
బాక్సింగ్ దునియాను ఏలినోడు.. యూట్యూబర్ చేతిలో ఓడాడు..
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20: ఆ ఇద్దరి జోడీకి టీమిండియా రికార్డులు బద్దలు
టెన్నిస్‌కు ప్రజ్నేష్ వీడ్కోలు
For More Sports And Telugu News