Share News

SRH vs PBKS: లీగ్ దశలో సన్‌రైజర్స్ లాస్ట్ పంచ్ అదుర్స్.. పంజాబ్ బెదుర్స్

ABN , Publish Date - May 19 , 2024 | 07:20 PM

ఐపీఎల్ 2024 లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ భరిత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హెచ్రిచ్ క్లాసెన్ (42), నితీశ్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) రాణించడంతో భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ ఛేదించింది.

SRH vs PBKS: లీగ్ దశలో సన్‌రైజర్స్ లాస్ట్ పంచ్ అదుర్స్.. పంజాబ్ బెదుర్స్

హైదరాబాద్: ఐపీఎల్ 2024 లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ భరిత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హెచ్రిచ్ క్లాసెన్ (42), నితీశ్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) రాణించడంతో భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ ఛేదించింది. 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. మిగతా బ్యాటర్లలో షాబాజ్ ఖాన్ (3), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0), అబ్దుల్ సమద్ (11 నాటౌట్), సన్వీర్ సింగ్ (6 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.


పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. ఇక హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ చెరో వికెట్ తీశారు.

సిక్సర్ల మోత..

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగింది. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు 12 సిక్సర్లు బాదగా.. సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏకంగా 14 సిక్సర్లు బాదారు. హైదరాబాద్ ప్లేయర్లలో ఒక్క అభిషేక్ వర్మ ఒక్కడే 6 సిక్సర్లు కొట్టడం విశేషం.


మెరిసిన పంజాబ్ బ్యాటర్లు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71 పరుగులతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 215 పరుగులుగా ఉంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో పాటు కొత్త కుర్రాడు అథర్వ తైడే కూడా రాణించాడు. 27 బంతుల్లోనే 46 పరుగులు బాదాడు. ఆ తర్వాత క్రీజులో వచ్చిన రూసో కూడా ఫర్వాలేదనిపించారు. 24 బంతుల్లో 49 పరుగులు కొట్టి ఔటయ్యాడు. ఇక కెప్టెన్ జితేశ్ శర్మ (32 నాటౌట్) చివరిలో మెరిపించాడు. అయితే శశాంక్ సింగ్ (2), అశ్‌తోశ్ శర్మ(2) నిరాశ పరిచారు. జితేశ్ శర్మతో పాటు శివమ్ సింగ్ (2) నాటౌట్‌గా నిలిచాడు.

Updated Date - May 19 , 2024 | 07:26 PM