Paris Olympics: ఆమె ఓ ‘పురుషుడు’.. మహిళా బాక్సర్‌ను వెనక్కి పంపిన బ్రిటన్
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:54 AM
క్వార్టర్ ఫైనల్స్ వరకు అర్హత సాధించిన తైవాన్ మహిళా బాక్సర్ ఫైనల్స్ కు వెళ్లకుండానే వెనుదిరిగింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ టైలిల్ గెలిచిన ఆమె జెండర్ కు సంబంధించిన వివాదం ఎదుర్కొంటోంది.
పారిస్: తైవాన్‌కు చెందిన మహిళా బాక్సర్ లిన్ యూ టింగ్ మరోసారి లింగ వివాదంలో ఇరుక్కున్నారు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లిన్ ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో పాల్గొనవలసి ఉంది. అయితే, అక్కడి ఆర్గనైజర్స్ ఆమె జెండర్ గురించిన ప్రశ్నలను లేవనెత్తడంతో ఆమె తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు లింగ్ ఈ పోటీల నుంచి వైదొలగినట్టు తైవాన్ స్పోర్ట్స్ చీఫ్ ఒకరు బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే, లిన్ జెండర్ గురించి తామెక్కడా ప్రస్తావించలేదని.. ఆమె అసలు ఈవెంట్ లోనే పాల్గొనలేదంటూ ఆర్గనైజర్లు కౌంటర్ ఇస్తున్నారు.
ఏ పోటీలకెళ్లినా.. తనను ‘నువ్వు మహిళవేనా’ అనే ప్రశ్నలు తలెత్తడంతో ఏకంగా ప్రపంచ కప్ ఫైనల్స్ నుంచి తప్పుకోవాలని లింగ్ నిర్ణయించుకుంది అని తైవాన్ స్పోర్ట్స్ కమిటీ చెప్తోంది. గతేడాది పారిస్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో లింగ్ యూ తో పాటు అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ పై కూడా అనర్హత వేటు పడింది. వీరిలో పురుషులు సంబంధించిన జన్యువులు అధికంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో లిన్ యూ సాధించిన కాంస్యం పతకాన్ని కూడా రద్దు చేశారు.
పారిస్ ప్రమాణాలు, నిబంధనలను సైతం పూర్తి చేసిన లిన్ ఫైనల్స్ లో ప్రత్యర్థిపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. ప్రత్యర్థి కంటే 10 సెంటీ మీటర్లు ఎక్కవ పొడవుండటం లిన్ కు కలిసొచ్చింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లిన్.. పురుషులతో సమానమైన సామర్థ్యాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. గతేడాది నుంచి ఆమె చుట్టూ ఈ లింగ నిర్ధారణకు సంబంధించిన వివాదం ముసురుకుంటోంది. ఇన్ని వివాదాలున్నా.. 2024 టోక్యో అంతర్జాతీయ ఒలింపిక్ పోటీల్లో ఆమె పాల్గొనేందుకు కమిటీ అనుమతించడం విశేషం.