IND vs NZ: రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:16 PM
ముందు నుంచి భయపడుతున్నదే జరిగింది. న్యూజిలాండ్ నెలకొల్పిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చేతులెత్తేసింది.
ఫూణె: భారత్ లో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. అదే సమయంలో 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. పూణె వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ను మరో మ్యాచ్ 2-0 తేడాతో న్యూజిలాండ్ ఎగరేసుకుపోయింది. మిచెల్ శాంటర్న్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి భారత్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. 2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన టీమ్‌ఇండియా.. పుష్కరకాలం తర్వాత సిరీస్‌ను ఓడిపోవడం గమనార్హం.
పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ను కివీస్ 113 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 245 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77) హాఫ్ సెంచరీతో చక్కటి ప్రదర్శన చేశాడు. మిగిలిన ప్లేయర్లు మాత్రం భారీ స్కోరు చేయలేక చతికిలపడ్డారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబయి వేదికగా ప్రారంభంకానుంది.