Share News

IPL 2024 Play Offs: గుజరాత్, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ రద్దవడంతో మారిన ప్లే ఆఫ్స్ సమీకరణాలు

ABN , Publish Date - May 14 , 2024 | 03:20 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దవడంతో ‘ప్లే ఆఫ్స్’ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దవడంతో చెరొక పాయింట్ లభించడంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది.

IPL 2024 Play Offs: గుజరాత్, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ రద్దవడంతో మారిన ప్లే ఆఫ్స్ సమీకరణాలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దవడంతో ‘ప్లే ఆఫ్స్’ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దవడంతో చెరొక పాయింట్ లభించడంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది. మిగిలిన మరో మ్యాచ్‌లో గుజరాత్ గెలిచిన ఆ జట్టు ఖాతాలో గరిష్ఠంగా 13 పాయింట్లే ఉంటాయి కదా రేసు నుంచి వైదొలగింది. మరోవైపు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 19 పాయింట్లతో టాప్-2లో నిలవడం ఖరారైంది. కాగా మ్యాచ్ రద్దు ప్రభావం.. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో గమనిద్దాం...


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

ఆర్సీబీ ప్రస్తుతం 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. చివరిగా మిగిలిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌‌పై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. చెన్నైపై గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. ఇతర జట్ల ఫలితాల విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మిగిలివున్న తమ చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోతే సమీకరణాలు ఆర్సీబీకి సానుకూలంగా మారతాయి. 14 పాయింట్లు ఉన్న జట్లలో మెరుగైన రన్‌రేట్ కలిగివున్న టీమ్ ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఇక సన్‌రైజర్స్, ఎల్‌ఎస్‌జీ ఒక్కో మ్యాచ్ గెలిస్తే నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. చెన్నైపై బెంగళూరు భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.


చెన్నై సూపర్ కింగ్స్..

ఆర్సీబీపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఓటమిపాలైతే మాత్రం చెన్నై జట్టు అవకాశాలు అత్యంత సంక్లిష్ఠంగా మారాయి. ఒకవేళ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే 14 పాయింట్లతో చెన్నై రేసులో కొనసాగుతుంది. ఒకవేళ లక్నో రెండింటిలో ఒక మ్యాచ్‌లో ఓడిపోతే చెన్నైకి మెరుగైన నెట్ రన్ రేట్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ లక్నో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. సన్‌రైజర్స్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఆర్సీబీ చేతిలో చెన్నై ఓడిపోతే ప్లే ఆఫ్స్ బెర్తులు రసవత్తరంగా మారతాయి. నెట్ రన్ రేట్‌ ఆధారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.


లక్నో సూపర్ జెయింట్స్..

ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే మొత్తం 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఆర్సీబీపై చెన్నై గెలిచి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిస్తే మొత్తం 3 జట్లు 16 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఒకవేళ సన్‌రైజర్స్ మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోతే లక్నో టాప్-4వ స్థానానికి చేరుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌తో సంబంధం లేకుండా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కి చేరుకుంటుంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయం. ఒకవేళ ఒక మ్యాచ్‌లో ఓడిపోయి.. లక్నో తన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే రెండు జట్లూ 16 పాయింట్లతో ఉంటాయి. ఈ సమీకరణంతో మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఉన్న సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అవుతుంది. ఒకవేళ సన్‌రైజర్స్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి.. లక్నో మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే..ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే ఫలితంపై సన్‌రైజర్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే గెలిస్తే సన్‌రైజర్స్ నిష్క్రమిస్తుంది. అయితే ఆర్సీబీ చేతిలో చెన్నై ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ రేసు ఖరారవుతుంది.

Updated Date - May 14 , 2024 | 03:21 PM