Share News

Virat Kohli: స్టేడియం దద్దరిల్లింది.. పాక్ టీవీలు పగిలాయి..

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:43 PM

పాక్ ఆటగాళ్లకు 2022 అక్టోబర్ 23 ఓ పీడకల. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై టీమిండియా ప్రపంచకప్ కోసం పోటీ పడుతున్న మ్యాచ్ అది. అప్పటికే భారత్ ఓటమి అంచుల దాకా వెళ్లింది. ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ వంతు వచ్చింది.

Virat Kohli: స్టేడియం దద్దరిల్లింది.. పాక్ టీవీలు పగిలాయి..
Virat Kohli

ముంబై: బ్యాట్ ఝులిపిస్తూ మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయాడు. తన బ్యాటింగ్ తో పాకిస్థాన్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని టీమిండియాకు అందించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 మ్యాచ్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెట్టింట కోహ్లీ మ్యాజికల్ షాట్స్ మరోసారి వైరల్ గా మారాయి.


పాకిస్థాన్ పై భారీ విజయం

ఆనాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులు సంబరపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2022 తొలి సూపర్‌ 12 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యాతో కలిసి మర్చిపోలేని ఇన్నింగ్స్(82*; 53 బంతుల్లో 6x4, 4x6) ను ఆడిన సంగతి తెలిసిందే. ఆరోజు విరాట్ షాట్లకు స్టేడియం దద్దరిల్లింది. ఓటమిని తట్టుకోలేక పాకిస్థాన్ అభిమానులు టీవీలను పగలగొట్టారు.


నోబాల్ ను సిక్సర్ చేసి..

ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్‌ మసూద్‌ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ 159/8కి పరిమితమైంది. తడబడుతూ ఛేజింగ్ చేసిన భారత్ 10 ఓవర్లకు 45-4 గా ఉంది. కానీ హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మ్యాచ్ ను 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు విజయానికి 16 రన్స్‌ అవసరమయ్యాయి. పాండ్యా ఔటైనా, విరాట్ కోహ్లీ నోబాల్ ను సిక్సర్ గా మలవడం, ఫ్రీహిట్‌ బంతికి 3 పరుగులు తీశారు. చివరి బంతికి సింగిల్ తీయడంతో భారత్ ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది.

IND vs AUS: తెలుగు కుర్రాడికి బంపర్ ఆఫర్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ

Updated Date - Oct 23 , 2024 | 01:47 PM