Share News

Varun Chakaravarthy: మ్యాచ్ పోయినా సౌతాఫ్రికాను వణికించాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది

ABN , Publish Date - Nov 11 , 2024 | 10:02 AM

కమ్‌బ్యాక్ అంటే ఇలాగే ఉండాలి అనేలా ఆడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. సూపర్బ్ బౌలింగ్‌తో అందరి మనసులు దోచుకుంటున్న ఈ స్పిన్ మాంత్రికుడు.. ప్రత్యర్థి బ్యాటర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు.

Varun Chakaravarthy: మ్యాచ్ పోయినా సౌతాఫ్రికాను వణికించాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది

IND vs SA: అందరు క్రికెటర్లలాగే అతడు కూడా నేషనల్ టీమ్‌కు ఆడాలనుకున్నాడు. తన బౌలింగ్ టాలెంట్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించాడు. కానీ ఏం లాభం.. ఒకే ఒక్క టోర్నమెంట్‌తో మళ్లీ అడ్రస్ లేకుండా పోయాడు. టీమ్‌లోని మిగతా ప్లేయర్లు కూడా విఫలమైనా ఓటమికి అతడ్ని బాధ్యుడ్ని చేశారు. రీఎంట్రీ కోసం ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. ఎంత బాగా ఆడినా టీమ్‌లోకి తీసుకోకపోవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ అతడి కష్టం వృథా పోలేదు. మళ్లీ ఆడే అవకాశం వచ్చింది. అంతే.. ఇన్నాళ్లూ పడిన బాధల్ని మర్చిపోయి స్పిన్ మ్యాజిక్‌తో టీమ్‌ సక్సెస్‌లో కీలకంగా మారాడు. అతడే టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. కమ్‌బ్యాక్ అంటే ఇలా ఉండాలి అనేలా అతడి ఆట సాగుతోంది.


మొదట్లోనే బలి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వరుణ్ చక్రవర్తి ఒకడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ అందర్నీ ఆకర్షించాడతను. అతడి బౌలింగ్‌లో ఉన్న పస, వేరియేషన్స్, టర్న్ చేసే తీరు నచ్చి టీమిండియాలోకి చోటు ఇచ్చారు సెలెక్టర్లు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మూడు మ్యాచుల తర్వాత ఏకంగా టీ20 వరల్డ్ కప్-2021లో ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు వరుణ్. కానీ ఆ టోర్నీలో భారత జట్టు కప్పు కొట్టడంలో ఫెయిలైంది. దారుణమైన ఆటతీరుతో న్యూజిలాండ్, పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోయింది. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టి తీవ్ర విమర్శలపాలైంది. దీంతో జట్టులోని కొందరు ప్లేయర్లను తప్పించారు. అయితే కొత్తగా టీమ్‌లోకి వచ్చిన వరుణ్‌ను కూడా బాధ్యుడ్ని చేశారు.


గంభీర్ సపోర్ట్‌తో సక్సెస్

పొట్టి ప్రపంచ కప్‌లో ఓటమితో వరుణ్‌ టీమిండియాకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా తిరిగి జట్టులోకి రాలేకపోయాడు. ఐపీఎల్-2023లో అద్భుతంగా బౌలింగ్ చేసి 20 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లోనూ రాణించిన స్పిన్నర్ 21 వికెట్లు పడగొట్టాడు. అయినా అతడ్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. దీంతో అతడు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. తనకు పీఆర్ టీమ్ లేకపోవడం వల్లే పేరు రావట్లేదని, బహుశా అందుకే తీసుకోవట్లేదేమోనని వాపోయాడు. అయితే కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేసిన గౌతం గంభీర్ భారత జట్టుకు కొత్త కోచ్‌గా రావడం వరుణ్‌కు ప్లస్ అయింది. బంగ్లాదేశ్ సిరీస్‌లో వరుణ్‌ను ఆడించాడు గౌతీ. ఆ సిరీస్‌లో 5 వికెట్లతో సత్తా చాటాడు. సౌతాఫ్రికాతో తాజా సిరీస్‌లో రెండు మ్యాచుల్లోనే ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ టీ20లో ప్రొటీస్‌ బ్యాటర్లను తన స్పిన్, వేరియేషన్స్, లైన్, పేస్‌తో వణికించాడు. మ్యాచ్ పోయినా అతడి స్పెల్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు.


Also Read:

స్టార్టప్ దశ మార్చేసిన ధోని.. చిన్న సాయంతో వేల కోట్లు

రెండో టీ20లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు

ఉత్కంఠ పోరులో ముంబా గెలుపు

For More Sports And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 10:07 AM