Virat Kohli: ఫామ్‌లో ఉండేందుకు పదేళ్లుగా కోహ్లీ చేస్తున్న త్యాగం.. అనుష్క చెప్పిన సీక్రెట్స్
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:59 PM
ఒకప్పుడు అధిక బరువు కారణంగా విమర్శల పాలైన ఆ కోహ్లీనే ఇప్పుడు ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అయితే, ఈ ట్రాన్స్‌ఫర్‌మేషన్ అంత ఆషామాషీగా జరిగింది కాదని అనుష్క శర్మ వివరించింది.
ముంబై: 365 రోజులు, మూడు ఫార్మాట్లు.. లెక్కకు మించిన మ్యాచులు.. ఇవన్నీ సింగిల్ హ్యాండ్‌తో మెయింటెయిన్ చేస్తూనే పరుగుల వరద పారించిన రికార్డు కోహ్లీది. అయితే, విరాట్ కోహ్లీ ఇన్నేళ్లుగా తన ఫామ్‌ను కాపాడుకోవడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, మరెన్నో త్యాగాలు ఉన్నాయని అతడి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. క్రికెట్ కోసం కోహ్లీ ఎంతో కఠినమైన క్రమశిక్షణను ఫాలో అవుతాడని తెలిపింది. అతడి డైలీ రొటీన్ గురించి అనుష్క మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
‘‘ఎంతో డిసిప్లేన్ తో కూడిన దినచర్య, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కోహ్లీ వెనకున్న అసలైన శక్తులు. మూడు ఫార్మాట్లలోనూ ఒత్తిడిని తట్టుకుని నిలబడగలిగేంత ధైర్యం అతడికి అందులోనుంచే వచ్చింది. రోజూ ఉదయం కార్డియో లేదా హెచ్ఐఐటి చేస్తాడు. లేదా నాతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడు. అతడు తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాడు. దాదాపు పదేళ్లుగా తనకు ఎంతో ఇష్టమైన బటర్ చికెన్‌ను కోహ్లీ త్యాగం చేశాడంటే మీరు నమ్ముతారా?.. పుడ్ తో పాటు ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా ఉండాల్సిందే. అతడి అత్యుత్తమ పనితీరుకు ఇదే నిదర్శనం. మన జీవనశైలి మన నియంత్రణలో ఉండాలని కోహ్లీ ఎప్పుడూ చెప్తుంటారు. అదే అతడిని ప్రపంచస్థాయి అథ్లెట్ గా మార్చింది’’ అని అనుష్క వివరించింది. కోహ్లీ ఈ విషయంలో తనతో పాటు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడని వివరించింది.