Share News

T20 World Cup: సెమీఫైనల్స్‌లో వర్షం పడితే ఏమవుతుంది.. ఐసీసీ నిబంధనలేంటి?

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:04 PM

టీ20 వరల్డ్‌కప్-2024 ఇప్పుడు తుది దశకు చేరువలో ఉంది. గ్రూప్, సూపర్-8 దశలు ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్‌లో..

T20 World Cup: సెమీఫైనల్స్‌లో వర్షం పడితే ఏమవుతుంది.. ఐసీసీ నిబంధనలేంటి?
ICC Rules For Semifinals

టీ20 వరల్డ్‌కప్-2024 (T20 World Cup) ఇప్పుడు తుది దశకు చేరువలో ఉంది. గ్రూప్, సూపర్-8 దశలు ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. భారత్ (India), ఇంగ్లండ్ (England), సౌతాఫ్రికా (South Africa), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్లు సెమీస్‌లో తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. వెస్టిండీస్ కాలమానం ప్రకారం.. జూన్ 26, జూన్ 27న నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ.. భారత కాలమానం ప్రకారం జూన్ 27న రెండు మ్యాచ్‌లు ఉండనున్నాయి.

ఉదయం 6:00 గంటలకు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ (SA vs AFG) జట్లు తలపడనుండగా.. భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్లు ఫైనల్స్‌లో బెర్తు ఖరారు చేసుకునేందుకు రాత్రి 8:00 గంటలకు పోటీ పడతాయి. అయితే.. ఈ రెండు మ్యాచ్‌లకు వరుణుడి గండం పొంచి ఉంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ రెండు మ్యాచ్‌లకు వేదిక కానున్న ట్రినిడాడ్, గయానాలలో నిరంతరం వర్షం కురవనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐసీసీ ఈ నాకౌట్ మ్యాచ్‌లకు కొన్ని నిబంధనలను రూపొంచింది.


ఒకవేళ వర్షం పడితే..

* ముందుగా జరిగే సౌతాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు 90 నిమిషాల అదనపు సమయంతో పాటు రిజర్వ్ డేని కేటాయించింది. ఎక్కడైతే ఆట ముగిసిందో.. తిరిగి అక్కడి నుంచే రిజర్వ్ డే రోజున 190 నిమిషాల పాటు ఆటను కొనసాగించే అవకాశం కల్పించింది.

* భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్‌కి మాత్రం రిజర్వ్ డేని కేటాయించలేదు. కానీ.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అవ్వకుండా ఉండేందుకు గాను ఏకంగా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చింది. అంటే.. 4 గంటల 10 నిమిషాలు ఎక్స్‌ట్రా టైం దొరుకుతుంది.

* అదనపు సమయం కేటాయించినప్పటికీ.. నాకౌట్ మ్యాచ్‌లు నిరంతరం వర్షం కారణంగా రద్దయితే.. సూపర్-8 దశలో రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో ఉండే రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి. అంటే.. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగొచ్చు.

* అదే విధంగా.. ఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం దెబ్బకు రద్దు అయితే, అప్పుడు ఫైనల్‌కు చేరిన ఇరుజట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించడం జరుగుతుందని ఐసీసీ రూల్స్ చెప్తున్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 03:04 PM