IPL 2024: పిల్లల ఫీజు కోసం డబ్బుల్లేవ్ కానీ.. ధోనీ కోసం రూ.64 వేలు ఖర్చు
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:52 PM
ఒక్కోసారి అభిమానం హద్దులు దాటుతుంటుంది. తమని తాము డై-హార్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్లు.. తమకు నచ్చిన సెలెబ్రిటీలపై అభిమానం చాటుకోవడం కోసం అప్పుడప్పుడు అతిగా ప్రవర్తిస్తుంటారు. తమ సొంత విషయాలను పట్టించుకోకుండా.. అనవసరమైన స్టంట్స్ చేయడం, తాహతుకి మించి ఖర్చులు వెచ్చించడం లాంటివి చేస్తుంటారు.
ఒక్కోసారి అభిమానం హద్దులు దాటుతుంటుంది. తమని తాము డై-హార్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్లు.. తమకు నచ్చిన సెలెబ్రిటీ (హీరోలు, క్రికెటర్లు)లపై అభిమానం చాటుకోవడం కోసం అప్పుడప్పుడు అతిగా ప్రవర్తిస్తుంటారు. తమ సొంత విషయాలను పట్టించుకోకుండా.. అనవసరమైన స్టంట్స్ చేయడం, తాహతుకి మించి ఖర్చులు వెచ్చించడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఓ అభిమాని కూడా అలాంటి పనే చేశాడు. తన కూతుళ్ల ఫీజు కోసం జమ చేసిన కొంత డబ్బుని.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని (Mahendra Singh Dhoni) చూసేందుకు వృధా చేసి విమర్శలపాలవుతున్నాడు.
Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు
సాధారణంగా.. ఎంఎస్ ధోనీని చూసేందుకు అభిమానులు మైదానానికి పోటెత్తుతుంటారు. సీఎస్కే మ్యాచ్ ఉందంటే చాలు.. మైదానం ఏదైనా, అది దాదాపు పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది. యువకుల నుంచి పెద్దల దాకా.. ప్రతి ఒక్కరూ ధోనీ కోసం గ్రౌండ్‌కి వస్తారు. అలాగే.. తమిళనాడుకి చెందిన ఓ వీరాభిమాని కూడా, దోనీని మైదానంలో ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చాడు. అయితే.. అందుకోసం అతడు ఏకంగా రూ.64 వేలు వెచ్చించాడు. చెన్నై మ్యాచ్ ఉన్నప్పుడు తనకు టికెట్లు దొరక్కపోవడంతో.. బ్లాక్‌లో ఆ టికెట్లను అంత భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ, ఆ తర్వాత అతను చెప్పిన విషయమే అందరినీ ఆశ్చర్యానికి, అసహనానికి గురి చేసింది.
Rishabh Pant: అంపైర్‌తో రిషభ్ పంత్ గొడవ.. జరిమానా విధించాల్సిందేనా?
తన ముగ్గురు కూతుళ్ల ఫీజు తాను ఇంకా కట్టలేదని, అందుకు తన వద్ద డబ్బులు లేవని, కానీ ధోనీని ఒక్కసారైనా చూడాలన్న ఉద్దేశంతో రూ.64 వేలు ఖర్చు చేసి బ్లాక్‌లో టికెట్లు కొన్నానని తెలిపాడు. ఇదే అతని పాలిట శాపమైంది. ధోనీ ఫ్యాన్స్ అతని అభిమానాన్ని మెచ్చుకుంటున్నారు కానీ, మిగతావాళ్లు మాత్రం అతడ్ని తిట్టిపోస్తున్నారు. అభిమానం ఉండాలి కానీ, మరీ ఇంత మూర్ఖత్వం ఉండకూడదంటూ విమర్శిస్తున్నారు. చివరికి క్రికెటర్లు సైతం తమ వ్యక్తిగత విషయాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారని, అలాంటిది ఫీజుకి డబ్బుల్లేనప్పుడు రూ.64 వేలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఏముందని మండిపడుతున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి