Team India: కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాకు కీలక సలహా ఇచ్చిన కపిల్ దేవ్
ABN , Publish Date - Nov 08 , 2024 | 08:30 AM
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు స్పిన్నర్లపై కూడా అభిమానులు, మాజీలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీమిండియా క్రికెట్లు కీలకమైన సందేహాన్ని ఇచ్చాడు. ప్రాక్టీస్ చేయడం ఒక్కటే బ్యాటర్లు మెరుగుపడేందుకు ఉన్న ఏకైక మార్గమని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తిరిగి బేసిక్స్‌కు వెళ్లాలని సలహా ఇచ్చాడు.
ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య భారత్ అవమానకర రీతిలో 0-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసింది. వైట్‌వాష్‌కు గురవడంతో జట్టుపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత బ్యాటర్లు, స్పిన్నర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ బ్యాటర్లుగా జట్టులో కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై కూడా అభిమానులు, మాజీలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీమిండియా క్రికెట్లు కీలకమైన సందేహాన్ని ఇచ్చాడు. ప్రాక్టీస్ చేయడం ఒక్కటే బ్యాటర్లు మెరుగుపడేందుకు ఉన్న ఏకైక మార్గమని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తిరిగి బేసిక్స్‌కు వెళ్లాలని సలహా ఇచ్చాడు.
“బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. రూమ్‌లో కూర్చోని మెరుగవుతామంటే అది జరిగే పనికాదు. మీరు కష్టకాలంలో ఉన్నారనుకుంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది’’ కపిల్ దేవ్ సూచించాడు. ఈ మేరకు ‘క్రికెట్ నెక్స్ట్’తో మాట్లాడాడు.
3-1తో గెలుస్తాం: రికీ పాంటింగ్..
భారత జట్టులో మహ్మద్ షమీ లేకపోవడంతో ఒక టెస్ట్‌లో 20 వికెట్లు తీయడం టీమిండియాకు అతిపెద్ద సవాలు అని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. 2018-19, 2020-21లో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాలకు ఆసీస్ జట్టు ముగింపు పలుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో చారిత్రాత్మక రీతిలో ఓడిపోయిన భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియాకు మంచి అవకాశం ఉందని పాంటింగ్ విశ్లేషించాడు. ఐసీసీ రివ్యూ షోలో రికీ పాంటింగ్ మాట్లాడాడు. భారత్‌ను ఓడించే అవకాశాలు మునపటి కంటే ఇప్పుడే అధికంగా ఉన్నాయన్నారు.
గాయం కారణంగా షమీ గత నవంబర్ నుంచి దూరంగా ఉన్నాడని పాంటింగ్ గుర్తుచేశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, అన్‌క్యాప్డ్ ప్లేయర్ హర్షిత్ రాణాలతో కూడిన భారత బౌలింగ్ దళంలో షమీ లేకపోవడం పెద్ద లోటును మిగిల్చిందని విశ్లేషించాడు. ‘‘షమీ లేకుండా భారత్ ఒక టెస్ట్ మ్యాచ్‌లో 20 వికెట్లు తీయడం అతిపెద్ద సవాలుగా నేను భావిస్తున్నాను. 5 టెస్టుల్లో ఎక్కడో ఒక్కటి మాత్రమే భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించడం చాలా కష్టతరమైన విషయం’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.