Home » Kapil Dev
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు స్పిన్నర్లపై కూడా అభిమానులు, మాజీలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీమిండియా క్రికెట్లు కీలకమైన సందేహాన్ని ఇచ్చాడు. ప్రాక్టీస్ చేయడం ఒక్కటే బ్యాటర్లు మెరుగుపడేందుకు ఉన్న ఏకైక మార్గమని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తిరిగి బేసిక్స్‌కు వెళ్లాలని సలహా ఇచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఇవాళ(మంగళవారం) సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కపిల్‌దేవ్ చర్చించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధితో పాటు అమరావతిలో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుపై సీఎంతో కపిల్‌దేవ్ చర్చించారు.
బీసీసీఐ కార్యదర్శి జై షా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి..
భారతదేశానికి మొట్ట మొదటి సారి క్రికెట్ ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు కపిల్ దేవ్ తాజాగా బీసీసీఐకి ఓ లేఖ రాశాడు. తమ సహచర ఆటగాడు, టీమిండియాకు రెండు సార్లు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన అన్షుమన్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, అతడికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
‘నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్ లోనే’ అని భారత తొలి క్రికెట్ వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్‌దేవ్(Kapil Dev) తెలిపారు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ శనివారం 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు. శనివారంతో కపిల్ దేవ్ 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలోనే కెప్టెన్‌గా, గొప్ప ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.
భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.
ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లకు డబ్బు, అహంకారం, అహం పెరిగిపోయాయంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుత ఆటగాళ్లు తమకు అంతా తెలుసని భావిస్తారని, సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరని మండిపడ్డారు.
భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి ఆదివారానికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు నాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. అదేటంటే ప్రస్తుతం ఉన్న టీమిండియాకు ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను గెలిచే సత్తా ఉందా? ఈ క్రమంలో భారత అభిమానులు 1983లోని కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియాను, ప్రస్తుత 2023లోని రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియాను పోల్చి చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులంతా ఆ మధురానుభుతులను ఒకసారి నెమరువేసుకుంటున్నారు. నాటి విజయం ఏ ఒక్కరి వల్లనో దక్కింది కాదు. నాటి ప్రపంచకప్ విజయంలో టీంలోని ఆటగాళ్లంతా కీలకపాత్ర పోషించారు. అయితే నాటి ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో మొత్తం ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఎలా ఆడారు.? ఏ బ్యాటర్ ఎన్ని రన్స్ కొట్టాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీశాడు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.