Share News

T20 World Cup 2024: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ధర.. తెలిస్తే షాక్ అవుతారు

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:15 AM

టీ20 ప్రపంచకప్‌ 2024(T20 World Cup 2024)లో నేడు (జూన్ 9న) భారత్‌-పాకిస్తాన్(india vs pakistan) మ్యాచ్‌ జరగనుంది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న ఈ మ్యాచుకు క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించేందుకు అభిమానుల్లో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో టిక్కెట్ల రేట్లు కోట్లలో పలుకుతున్నాయి.

T20 World Cup 2024: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ధర.. తెలిస్తే షాక్ అవుతారు
icc t20 world cup 2024 india vs pakistan

టీ20 ప్రపంచకప్‌ 2024(T20 World Cup 2024)లో నేడు (జూన్ 9న) భారత్‌-పాకిస్తాన్(india vs pakistan) మ్యాచ్‌ జరగనుంది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న ఈ మ్యాచుకు క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించేందుకు అభిమానుల్లో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో టిక్కెట్ల రేట్లు కోట్లలో పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్‌ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని ఓ సీటు ధర ఏకంగా రూ.1.46 కోట్లుగా ఉంది. సెక్షన్ 252లోని 20వ వరుసలోని 30వ సీటు టిక్కెట్‌ల ధర రూ. 1.46 కోట్లు($ 175,400). ఈ టిక్కెట్ StubHub వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.


కానీ ముందున్న వరుసలోని సీటు ధర రూ.67 వేలు ఉండటం విశేషం. అయితే ఇక్కడ వినోదంతోపాటు క్రీడా వంటి ఈవెంట్ల టిక్కెట్లను కూడా బ్లాక్ మార్కెట్లో చట్టబద్ధంగా విక్రయించుకోవచ్చు. అంతేకాదు మీ దగ్గర టిక్కెట్ ఉంటే దానిని మీరు ఆన్‌లైన్ ద్వారా ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చు. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి ఈ టిక్కెట్ ధరను భారీగా పెంచేశాడు. అయితే ఆ రేటును తగ్గించమని కస్టమర్లు బేరం కూడా ఆడగవచ్చు. డీల్ కుదిరితే విక్రయిస్తారు. అయితే ఆ టిక్కెట్ ఇంకా అమ్ముడుపోనప్పటికీ, విక్రయదారుడు అడుగుతున్న మొత్తం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


మరికొన్ని టిక్కెట్ ధరలు సాధారణంగా $700 నుంచి $1,000 (₹57,000 నుంచి ₹82,000) వరకు ఉన్నాయి. ఇవి అసలు ధర కంటే చాలా ఎక్కువ. అదనంగా StubHubలో టిక్కెట్ ధర $18,000 (సుమారు రూ. 4,75,000), వయాగోలో అత్యంత ఖరీదైన టిక్కెట్ ధర $6,700 (సుమారు ₹5,50,000). కొన్ని టిక్కెట్‌లు ఇప్పటికీ ICC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు ₹1,50,000 నుంచి ₹10,00,000 మధ్య ఉన్నాయి. ఏ విధంగా చూసినా కూడా లక్ష రూపాయలకుపైగానే టిక్కెట్ల రేట్లు ఉండటం విశేషం.


ఇది కూడా చదవండి:

Narendra Modi Swearing Ceremony: నేడు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం.. నేడు, రేపు ఆంక్షలు, 500 సీసీటీవీలతో..

Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలకు చెక్.. భారీగా తగ్గిన రేట్లు


Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 09:17 AM