Share News

SL vs IND: చేతికి నల్ల బ్యాడ్జి ధరించిన టీమిండియా ప్లేయర్స్.. అసలేమైంది..!

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:55 PM

SL vs IND 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, భారత్‌లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మొదటిసారి వన్డే క్రికెట్ ఆడనుండటం మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.

SL vs IND: చేతికి నల్ల బ్యాడ్జి ధరించిన టీమిండియా ప్లేయర్స్.. అసలేమైంది..!
IND vs SL 1st ODI Match

SL vs IND 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, భారత్‌లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మొదటిసారి వన్డే క్రికెట్ ఆడనుండటం మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. మ్యాచ్‌లో భాగంగా శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బౌలింగ్‌కు సిద్ధమైంది. అయితే, ఫీల్డింగ్‌కు వచ్చింది టీమిండియా ప్లేయర్స్ అంతా తమ చేతులకు నల్ల రిబ్బన్ బ్యాండ్స్ కట్టుకుని కనిపించారు. మరి టీమిండియా ప్లేయర్స్ ఎందుకిలా నల్ల బ్యాండ్ ధరించారో తెలుసుకుందాం.


జులై 31వ తేదీన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో సుధీర్ఘ కాలం పోరాటం చేసిన ఆయన.. 71 ఏళ్ల వయసులో బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయనకు నివాళలుర్పించేందుకు భారత క్రికెట్ ప్లేయర్స్ తమ చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించారు. గైక్వాడ్ భారత జట్టు సెలెక్టర్‌గా జట్టు కోచ్‌గా కూడా పని చేశారు. అంతకు ముందు ఆయన టీమిండియా తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు, 15 వన్డేలు ఆడారు. గైక్వాడ్ టెస్టుల్లో 1985 పరుగులు, వన్డేల్లో 266 పరుగులు చేశారు.


అన్షుమాన్ గైక్వాడ్ మృతిపై టీమిండియా ప్లేయర్స్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఆయనతో కొంత సాన్నిహిత్యం ఉందని.. బీసీసీఐ అవార్డ్స్ సమయంలో గైక్వాడ్‌తో మాట్లాడటం తన అదృష్టంగా పేర్కొన్నాడు రోహిత్ శర్మ. అన్షుమాన్ గైక్వాడ్‌తో మాట్లాడం ద్వారా ఆట గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. గైక్వాడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రోహిత్ పేర్కొన్నాడు.


ఇక తొలి వన్డే విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా నుంచి సిరాజ్ తొలి ఓవర్ బౌలింగ్‌తో స్టార్ట్ చేశారు.

ప్లేయర్స్..

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ , సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, అసిత ఫెర్నాండో, అకిలా దనంజయ, మొహమ్మద్ షిరాజ్.


Also Read:

Boxers : మహిళల పోటీల్లో పురుషులా?

Swimming : ఎదురులేని లెడెకి

నడాల్‌.. ఒలింపిక్స్‌ ఆఖరి మ్యాచ్‌

For More Sports News and Telugu News..

Updated Date - Aug 02 , 2024 | 04:55 PM