Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా బీ గ్రాండ్ విక్టరీ.. 76 పరుగుల తేడాతో ఓటమి
ABN , Publish Date - Sep 08 , 2024 | 06:04 PM
దులీప్ ట్రోఫీలో భారత్ ఏపై భారత్ బీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా బీ 76 పరుగుల తేడాతో ఇండియా ఏపై విజయం సాధించింది. కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్ పోరాడినప్పటికీ విజయం సాధించలేదు.
దులీప్ ట్రోఫీ 2024(Duleep Trophy) మొదటి రౌండ్ మ్యాచ్‌లు ముగిశాయి. శ్రేయాస్ అయ్యర్ మాదిరిగానే, స్టార్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో ఉన్న జట్టు కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలోని ఇండియా బీ 76 పరుగుల తేడాతో ఇండియా ఏపై విజయం సాధించింది. ఈ ఓటమి శుభ్‌మాన్ గిల్‌కు మరింత బాధాకరమని చెప్పవచ్చు. ఎందుకంటే అతను బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. కెప్టెన్సీలో కూడా ప్రభావం చూపలేకపోయాడు. మ్యాచ్ చివరి రోజున భారత్ ఏ విజయానికి 275 పరుగులు చేయాల్సి ఉండగా, 194 పరుగులకే జట్టు కుప్పకూలింది.
ఆకాశ్ దీప్ 5 వికెట్లు
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చివరి రోజైన సెప్టెంబర్ 8న భారత్ బీ తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నప్పటికీ మిగతా 4 వికెట్లు తీయడానికి భారత్ ఏకు ఎక్కువ సమయం పట్టలేదు. కానీ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ మరోసారి స్టార్ అయ్యాడు. అతను ఈ 4 వికెట్లలో 3 వికెట్లు పడగొట్టాడు. ఇండియా బీని 181 పరుగులకు కట్టడి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన ఆకాశ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు పడగొట్టి టెస్టు సిరీస్‌లో మరోసారి తన బలాన్ని నిరూపించుకున్నాడు.
అందరూ విఫలం
భారత్ బీ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యంలో ఉండి, భారత్ ఏకు 275 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆ క్రమంలో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ధ్రువ్ జురెల్, శివమ్ దూబే వంటి వంటి స్టార్లు ఉన్న జట్టు ఆకట్టుకుంటారని అనుకంటే, అది జరగలేదు. మయాంక్, శుభ్‌మన్ గిల్, ర్యాన్, శివమ్‌లతో సహా 6 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేశారు.
ఆ క్రమంలో జట్టు ఓటమి దాదాపు ఖారారయ్యిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో KL రాహుల్ చాలా ప్రయత్నాలు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడలేకపోయిన.. రెండో ఇన్నింగ్స్‌లో రాణించాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఔటయ్యాడు. ఆ తర్వాత యశ్ దయాల్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీల పేస్ ఎటాక్ భారత్ ఏను కుదిపేసింది.
ఇవి కూడా చదవండి..
Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..
IND vs BAN: భారత్, బంగ్లా టెస్ట్, T20 సిరీస్‌లు రద్దు అవుతాయా.. కొనసాగుతున్న బహిష్కరణ ట్రెండ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి