Funny Video: ఇదేందయా ఇదీ.. రోహిత్ శర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా..
ABN , Publish Date - Oct 24 , 2024 | 02:27 PM
Rohit Sharma Funny Video: సినిమాలో నటించే నటీ నటులకు, రాజకీయ ప్రముఖులకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. సెలబ్రిటీ ఎవరైనా తమకు కనిపిస్తే చాలు వారితో ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తమ అభిమాన వ్యక్తులు ఎక్కడికి వచ్చినా.. వెంటనే అక్కడికి వాలిపోతుంటారు ఫ్యాన్స్.
Rohit Sharma Funny Video: సినిమాలో నటించే నటీ నటులకు, రాజకీయ ప్రముఖులకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. సెలబ్రిటీ ఎవరైనా తమకు కనిపిస్తే చాలు వారితో ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తమ అభిమాన వ్యక్తులు ఎక్కడికి వచ్చినా.. వెంటనే అక్కడికి వాలిపోతుంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్, క్రికెట్ సెలబ్రిటీస్ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్లినా.. అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు.
తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పాత వీడియోనే అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లో వచ్చింది. జనరల్‌గానే రోహిత్ శర్మ.. చాలా సరదాగా వ్యక్తి. తన సహచర క్రికెట్ ప్లేయర్లతో కూడా ఫన్నీ ఉంటాడు. జోక్స్ వేస్తూ, ఆటపట్టిస్తుంటాడు. అందిరితోనూ అలాగే స్పాంటేనియస్‌గా ఉంటాడు రోహిత్. వైరల్ అవుతున్న వీడియో రోహిత్ శర్మ తన టీమ్ బెంబర్స్‌తో కలిసి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని వారిని సెల్ఫీ వీడియో తీశాడు. ఇంతలో ఆ వ్యక్తిని సమీపించిన రోహిత్ శర్మ.. ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్‌ప్రైజ్‌కు అభిమాని మాత్రమే కాదు.. సోషల్ మీడియా లోకం మొత్తం అవాక్కైంది. మరి ఇంతకీ రోహిత్ శర్మ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే కింది వీడియోను చూడాల్సిందే.
రోహిత్ శర్మ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటంటే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుండగా.. ఓ అభిమాని తన ఫోన్‌తో వీడియో తీశాడు. ఇంతలో అతన్ని సమీపించిన రోహిత్ శర్మ.. తన చేతిలోని రోజా పువ్వును అభిమానికి ఇచ్చాడు. అంతటితో ఆగకుండా.. అతనికి ప్రపోజ్ చేశాడు. ‘ఐ లవ్ యూ.. విల్ యూ మ్యారీ మీ’ అంటూ స్టిన్నింగ్ ప్రపోజల్ చేశాడు. ఇది విన్న అభిమాని అవాక్కయ్యాడు. ఆ వెంటనే.. నవ్వుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read:
అలా ఎలా ఒప్పించావ్ భయ్యా.. సర్ఫరాజ్ రివ్యూ అదుర్స్
కివీస్‌తో మ్యాచ్.. అశ్విన్ పేరిట వరల్డ్ రికార్డ్
For More Cricket News and Telugu News..