Cricket: చితక్కొట్టిన భారత ఆటగాళ్లు.. బంగ్లా ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Oct 12 , 2024 | 09:23 PM
భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్‌ని ఉంచారు. అంతేకాకుండా టీ 20ల్లో భారత్ అత్యధిక స్కోర్ సాధించింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లా ముందు భారీ స్కోరు ఉంచింది.
హైదరాబాద్: భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్‌ని ఉంచారు. అంతేకాకుండా టీ 20ల్లో భారత్ అత్యధిక స్కోర్ సాధించింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లా ముందు భారీ స్కోరు ఉంచింది. సంజూ శాంసన్ (111, 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (75, 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు) విజృంభించిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఆఖరి రెండు ఓవర్లలో బ్యాటర్లు తడబడడంతో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (314) కాస్త దూరంలో నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ బంగ్లా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. రిషద్ వేసిన పదో ఓవర్లో సంజూ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. రెండో బంతి మినహా ఆ ఓవర్లో అన్ని బంతులూ సిక్సర్లే. ఈ క్రమంలోనే 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆబర్లో రియాన్ పరాగ్ 34, హార్దిక్ పాండ్య 47 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. రింకూ సింగ్ (8) నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3, టస్కిన్, ముస్తఫిజుర్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ తీశారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News