India vs Afghanistan: టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్..క్లీన్‌స్వీప్ చేస్తారా?
ABN , Publish Date - Jan 17 , 2024 | 06:45 PM
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బాగంగా చివరి మ్యాచ్ ఈరోజు (జనవరి 17) భారత జట్టు, అఫ్గానిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బాగంగా చివరి మ్యాచ్ ఈరోజు (జనవరి 17) భారత జట్టు, అఫ్గానిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. మరోవైపు ఈ మ్యాచులోనైనా గెలవాలని అప్గాన్ ఆటగాళ్లు చూస్తున్నారు. ఎలాగైనా భారత ఆటగాళ్లను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లోనూ గెలిస్తే అఫ్గానిస్థాన్‌ను క్లీన్‌స్వీప్‌తో ఓడించడం ఖాయం. జూన్‌లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కి ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం.
ఇక భారత్ జట్టులో రోహిత్ శర్మ (సి), రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, ఎస్ దూబే, జెఎమ్ శర్మ, ఆర్కే సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ ఉన్నారు. మరోవైపు అప్గాన్ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రహీం జద్రాన్ (C), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూ కలరు.