Champions Trophy: టీమిండియాను పాకిస్తాన్‌కు పంపకూడదు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Aug 31 , 2024 | 05:56 PM
వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ టోర్నీ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనే విషయంలో అనిశ్చితి నెలకొంది.
వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ టోర్నీ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా (TeamIndia) పాల్గొనే విషయంలో అనిశ్చితి నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించే అవకాశం కనిపించడం లేదు. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ (BCCI) పట్టుబడుతోంది. అందుకు పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) ఆశిస్తోంది. అలాగే ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా టీమిండియా తమ దేశ పర్యటనకు రావాలని కోరుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వారి వ్యాఖ్యలకు భిన్నంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌కు టీమిండియా రాకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ``పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే టీమిండియా ఇక్కడకు రాకపోవడమే మంచిది. నేనైతే అదే సలహా ఇస్తా. ఆటగాళ్ల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల``ని అన్నాడు.
``బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా ఇతర దేశాలు అంగీకరించాలి. ఎందుకంటే అది భద్రతకు సంబంధించిన విషయం. టోర్నీని హైబ్రిడ్ మోడళ్లలోనే నిర్వహిస్తే మంచిది. నేనైతే ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్‌లో జరుగుతుందని అనుకుంటున్నా. ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి`` అని కనేరియా వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?
Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..