Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:51 PM
శ్రీలంక టూర్ నుంచి తిరిగొచ్చిన టీమ్ ఇండియా(team india) వచ్చే నెల సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. అయితే ఈ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
శ్రీలంకతో భారత జట్టు(team india) చివరి మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్(bangladesh)తో టీమ్‌ఇండియా ముందున్న సవాల్ రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంతకు ముందు భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడనున్నారు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా ఇంకా జట్టు ప్రకటించలేదు. కానీ బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను టెస్టు జట్టులోకి ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరిగే టెస్టు సిరీస్ కోసం ముగ్గురు ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కడం కష్టమని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వారిలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఇక్కడ చుద్దాం.
1. సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ బుచ్చిబాబు టోర్నీలో ముంబై తరపున ఆడుతున్నాడు. కానీ అతని ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే సూర్య గాయపడ్డాడు. దీంతో దులీప్ ట్రోఫీలో సూర్య ఆడడం కష్టమని చెప్పవచ్చు. గాయం కారణంగా సూర్యకుమార్ దులీప్ ట్రోఫీలో ఆడలేకపోతే బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే.
2. శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ బ్యాడ్ ఫామ్ వీడే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. బుచ్చిబాబు టోర్నీలో శ్రేయాస్ కూడా ముంబై తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు అతని ప్రదర్శన పేలవంగా ఉంది. TNCA 11తో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో అయ్యర్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. అంతకుముందు శ్రీలంక టూర్‌లో వన్డే సిరీస్‌లో కూడా అయ్యర్ ఫ్లాప్ అని నిరూపించుకున్నాడు. అతని ఫ్లాప్ షో ఇలాగే కొనసాగితే టెస్టు జట్టు నుంచి కూడా తప్పుకోవడం ఖాయమనిపిస్తుంది.
3. సర్ఫరాజ్ ఖాన్
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్ టీమ్ ఇండియాకు అరంగేట్రం చేశాడు. సర్ఫరాజ్ అరంగేట్రం చాలా అద్భుతంగా ఉంది. తొలి మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు టోర్నీలో మాత్రం సర్ఫరాజ్ బ్యాటింగ్ నిరాశ జనకంగా తయారైంది. దీంతో దులీప్ ట్రోఫీలో సర్ఫరాజ్ పేలవ ఫామ్ కొనసాగితే టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని క్రీడా వర్గాలు అంటున్నాయి.
విశ్రాంతి తర్వాత
నెల రోజుల విశ్రాంతి తర్వాత భారత క్రికెట్ జట్టు ఆడనుంది. శ్రీలంక టూర్ నుంచి తిరిగొచ్చిన టీమ్ ఇండియా వచ్చే నెల సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఈ సిరీస్ ఆడనుంది. WTC పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను ఎలాగైనా గెలవాలి. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తే టీమ్ ఇండియా నంబర్ వన్ నుంచి నంబర్ టూ స్థానానికి పడిపోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్
Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త
Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం
Read More Sports News and Latest Telugu News