Share News

India vs New Zealand: 18 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. కారణమిదేనా

ABN , Publish Date - Oct 17 , 2024 | 02:47 PM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

India vs New Zealand: 18 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. కారణమిదేనా
india vs new zealand

బెంగళూరు(bengaluru) తొలి టెస్టు రెండో రోజు వర్షం ఆగగానే ఆట మొదలైంది. కానీ ఆ క్రమంలో న్యూజిలాండ్(New Zealand) బౌలర్ల దాటికి టీమిండియా(team india) అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో టీమిండియా 10 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి, 3 వికెట్లు కోల్పోయింది. గత 18 ఏళ్లలో స్వదేశంలో తొలి 10 ఓవర్లలో టీమిండియా సాధించిన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. అంతకుముందు 2006లో నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది. అంటే గత 23 ఏళ్లలో స్వదేశంలో టీమిండియాకు ఇంత దారుణమైన పరిస్థితి రావడం ఇది రెండోసారి.


నిరాశాజనక ఆరంభం

బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి 10 ఓవర్లలోనే టీమిండియా ముగ్గురు టాప్ బ్యాట్స్‌మెన్లు ఔటయ్యారు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. రెండు పరుగుల వద్ద టిమ్ సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి తన వికెట్‌ను విలియం ఓ రూర్కేకి ఇచ్చేశాడు. విరాట్ ఖాతా కూడా తెరవలేదు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్ మూడో బంతికే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అతని వికెట్‌ను మాట్ హెన్రీ తీశాడు.


చివరి బంతికి

ఆ క్రమంలో యశస్వి జైస్వాల్, పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. 31 స్కోర్ వద్ద భారత్‌కు నాలుగో ఎదురు దెబ్బ తగిలింది. విలియం ఓ రూర్కే యశస్వి జైస్వాల్‌ ఎజాజ్ పటేల్ క్యాచ్ పట్టాడు. ఆయన 13 పరుగులు చేశాడు. 33 పరుగుల వద్ద భారత జట్టులో సగం మంది పెవిలియన్‌కు చేరుకున్నారు. విలియమ్ ఐదో వికెట్‌గా రాహుల్‌ను పెవిలియన్ పంపించాడు. మాట్ హెన్రీ లంచ్ చివరి బంతికి టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చాడు. జడేజా వికెట్‌ తీశాడు. ఆ తర్వాత వచ్చిన తొలి బంతికే అశ్విన్‌ను పెవిలియన్‌కు పంపాడు.


ఐదు వికెట్లు

జడేజా తర్వాత అశ్విన్ కూడా ఖాతా తెరవలేకపోయాడు. అనంతరం భారత్ స్కోర్ 39. ఇదే సమయంలో పంత్ 20 పరుగులకే పెవిలియన్‌ చేరుకున్నాడు. దీంతో భారత్ 40 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. దీని తర్వాత చివరి వికెట్ కుల్దీప్ యాదవ్ రూపంలో పడింది. కుల్దీప్ 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కివీస్ జట్టులో మాట్ హెన్రీ ఐదు వికెట్లు, విలియం ఓ రూర్కే నాలుగు వికెట్లు తీశారు. టిమ్ సౌథీ ఒక వికెట్ తీశాడు.


కారణమిదేనా

అయితే ఈ మ్యాచులో భారత ఆటగాళ్లు దారుణంగా ఆడారా లేదా న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారా అనేది మాత్రం తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ మ్యాచులో మాత్రం పిచ్ చాలా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే బెంగళూరులో గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో పిచ్‌ను కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ తేమతో ఉన్న కారణంగా బౌలర్లు ప్రయోజనం పొందారు. ఇది అదునుగా భావించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు షార్ట్ బంతులతో టీమ్ ఇండియాపై ఎటాక్ చేశారు.


ఇవి కూడా చదవండి:

IPL 2025: ఎస్ఆర్‌హెచ్ షాకింగ్ నిర్ణయం.. ఈ ఆటగాడికి రూ.23 కోట్ల ఆఫర్..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 17 , 2024 | 02:56 PM