Share News

IPL 2024: రూ. 4500తో టికెట్ బుక్ చేసుకున్నాడు.. కానీ ప్రేక్షకుడు స్టేడియం వెళ్లి చూస్తే షాక్

ABN , Publish Date - Apr 08 , 2024 | 08:41 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో ఇటివల జరిగిన 18వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ జట్టు చెన్నైపై గెలిచింది. కానీ ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని మాత్రం నిరాశకు గురయ్యాడు.

IPL 2024: రూ. 4500తో టికెట్ బుక్ చేసుకున్నాడు.. కానీ ప్రేక్షకుడు స్టేడియం వెళ్లి చూస్తే షాక్

ఐపీఎల్ 2024(IPL 2024)లో ఇటివల జరిగిన 18వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ జట్టు చెన్నైపై గెలిచింది. కానీ ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని మాత్రం నిరాశకు గురయ్యాడు. ఎందుకంటే అతను ఈ మ్యాచ్ టికెట్ కోసం రూ. 4500 చెల్లించాడు. కానీ తీరా స్టేడియం వెళ్లి చూస్తే అతను బుక్ చేసుకున్న నంబర్ సీట్ అక్కడ లేకపోవడం విశేషం. అది తెలిసిన అతను ఆశ్చర్యానికి లోనై ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.


అతను షేర్ చేసిన పోస్టులో ఇలా పేర్కొన్నాడు. 'నేను టిక్కెట్‌ను బుక్ చేసుకున్నందుకు నిరాశ చెందాను. స్టాండ్‌లోని నంబర్ J66 సీటు అందుబాటులో లేదని తెలియజేయడానికి చింతిస్తున్నాను. ఆ క్రమంలో నేను నిలబడి మ్యాచ్‌ని ఆస్వాదించవలసి వచ్చింది. దీని కోసం నేను చెల్లించిన డబ్బు(money) వాపస్ వస్తుందా అని పేర్కొన్నారు. అతను అందుకు సంబంధించిన టిక్కెట్, వీడియో పోస్టులో జే66 సీటు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత J69, J70 సీట్ల మధ్య ఇన్నింగ్స్ విరామం సమయంలో తప్పిపోయిన సీటు గుర్తించినట్లు జునైద్ మరొక పోస్ట్‌ చేశారు. సీట్ నంబర్ తప్పుగా చూపుతున్న చిత్రాన్ని అప్‌లోడ్ చేసి ఎవరో తప్పు చేశారని వెల్లడించారు.


అయితే అప్పటికే ఈ సోషల్ మీడియా పోస్ట్ చూసిన నెటిజన్లు హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ టిక్కెట్లు అక్రమంగా సేల్ చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. బ్లాక్ టిక్కెట్ల స్కామ్ జరుగుతుందని కామెంట్లు చేశారు. మరోక వ్యక్తి మీరు తప్పనిసరిగా నగదు వాపసు పొందే అవకాశం ఉందన్నారు. వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయాలని ఇంకో వ్యక్తి వ్యాఖ్యానించారు. హైదారాబాద్‌లో(Hyderabad) ప్రతి సారి క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు అమ్ముకుంటారని మరొక వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా అతను పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఇది కూడా చదవండి:

Total Solar Eclipse: నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయోద్దంటే


Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు


మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 08 , 2024 | 08:44 AM