IPl 2024: RCB vs CSK మ్యాచ్ టాస్ గెల్చిన చెన్నై.. బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - May 18 , 2024 | 07:06 PM
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన చెన్నై జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన చెన్నై జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. ఇక ప్లేఆఫ్ ఛాన్స్ కోసం ఇరు జట్లు పోటీ పడుతుండగా వీరికి వరణుడు అడ్డుకట్ట వేస్తాడా లేదా మ్యాచ్ అడ్డంకులు లేకుండా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి మరి.
అదే సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైతే ఓవర్లను కట్ చేస్తారు. 20 ఓవర్ల మ్యాచుని 10-10 ఓవర్లు లేదా 5-5 ఓవర్ల మ్యాచుకు కుదించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో RCB మొదట బ్యాటింగ్ చేస్తే అది 80 పరుగులు చేసి చెన్నైని 62 పరుగులకే పరిమితం చేయాలి. చెన్నై 80 పరుగుల లక్ష్యాన్ని అందుకుంటే 3.1 ఓవర్లలో అంటే కేవలం 19 బంతుల్లోనే గెలవాల్సి ఉంటుంది. ఒక వేళ వర్షం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో CSK ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.
RCB స్క్వాడ్: ఫాఫ్ డు ప్లెసిస్ (C), రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, సుయాష్ ప్రభుదేశాయ్, విరాట్ కోహ్లీ, కెమెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, స్వప్నిల్ సింగ్, టామ్ కర్రాన్, అనుజ్ కార్తీక్, దినేష్, దినేష్, దినేష్. దీప్, అల్జారీ జోసెఫ్, హిమాన్షు శర్మ, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్, రాజన్ కుమార్, వైషాక్ విజయ్ కుమార్, యశ్ దయాల్.
CSK జట్టు: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (C), సమీర్ రిజ్వీ, షేక్ రషీద్, అజయ్ మండల్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, మహేఎంఎస్ ధోవనీష్, మహేఎంఎస్ ధోవనీష్ , ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, రాజవర్ధన్ హంగర్గేకర్, రిచర్డ్ గ్లీసన్, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Virat Kohli: రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..
Read Latest Sports News and Telugu News