IPL 2024: నేడు RCB vs SRH కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే
ABN , Publish Date - Apr 15 , 2024 | 08:57 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. బెంగళూరుకు ఇది 7వ మ్యాచ్. ఈ జట్టు 6 మ్యాచ్‌ల్లో కేవలం 1 విజయం సాధించి 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో దిగువన 10వ స్థానంలో ఉంది.
మరోవైపు హైదరాబాద్(SRH)కు ఇది ఆరో మ్యాచ్. ఐదింటిలో 3 విజయాలు సాధించి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకమని చెప్పవచ్చు. మరోవైపు బెంగళూరు(RCB) కూడా వరుసగా ఓటమి చెందుతున్న వేళ సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్ గెలవాలని చూస్తోంది.
ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. RCB 10, SRH 12 గెలిచింది. కాగా ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. బెంగళూరులో ఇరు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. బెంగళూరు 5, హైదరాబాద్ రెండు గెలిచాయి. ఇక్కడ ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలింది.
బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా ఉంది. బౌలర్లకు ఇక్కడ కొంచెం కష్టమేనని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ 91 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 38 మ్యాచ్‌లు గెలవగా, ఛేజింగ్ జట్లు 49 మ్యాచ్‌లు గెలిచాయి. ఇక్కడ 4 మ్యాచ్‌లు కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక బెంగళూరులో వెదర్ విషయానికి వస్తే సోమవారం వర్షం కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 21 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.
మరోవైపు ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు 46 శాతం గెలిచే ఛాన్స్ ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టులో ప్రాబబుల్ ప్లేయర్స్ ఫాఫ్ డు ప్లెసిస్ (C), విరాట్ కోహ్లి, విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, రీస్ టాప్లీ, విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో ప్రాబబుల్ ప్లేయర్స్ పాట్ కమిన్స్ (C), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, మయాంక్ మార్కండే కలరు.
ఇది కూడా చదవండి:
షూటర్ పాలక్‌కు ఒలింపిక్ బెర్త్
మరిన్ని క్రీడా వార్తల కోసం