IPL 2024: ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి.. కానీ రోహిత్ శర్మ పేరిట సరికొత్త రికార్డులు
ABN , Publish Date - Apr 15 , 2024 | 06:33 AM
ఐపీఎల్ 2024(IPL 2024)లో 29వ మ్యాచ్ నిన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ముంబై ఓడినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం 105 పరుగులు చేసి అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో 29వ మ్యాచ్ నిన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై(CSK) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో లాభపడగా, ముంబై ఇండియన్స్ మరింత దిగజారింది. అయితే MI మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ మ్యాచులో నాటౌట్‌గా నిలవడం, అతని జట్టు లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్కోరును ఛేదించే సమయంలో ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ అజేయంగా నిలిచిన 18 మ్యాచ్‌ల్లోనూ ముంబై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై(CSK) 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక తర్వాత ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్(MI)ను 186 పరుగులకే పరిమితమైంది. రోహిత్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. రోహిత్ 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ ఐపీఎల్‌లో రోహిత్‌కి ఇది మొదటి సెంచరీ, మొత్తంగా రెండోది. దీంతో ఐపీఎల్‌లో ముంబై(Mumbai) తరఫున ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 12 ఏళ్ల తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ క్రికెట్ లీగ్‌లో రోహిత్ సెంచరీ సాధించాడు.
టీ20 క్రికెట్‌లో రోహిత్‌కి ఇది ఎనిమిదో సెంచరీ(Century). అదే సమయంలో వాంఖడే స్టేడియంలో టీ20 క్రికెట్‌లో రోహిత్‌కి ఇదే తొలి సెంచరీ. 19.3 ఓవర్లో పతిరానా వేసిన బంతిని ఫోర్ కొట్టి హిట్‌మన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20 సెంచరీల విషయంలో భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ (9)తో ముందున్నాడు. ఈ క్రమంలో T20లో సెంచరీలు చేసిన నాల్గవ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు.
రోహిత్ తన ఇన్నింగ్స్‌లో టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా(500 sixes completed) సృష్టించాడు. చెన్నైపై 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత, రోహిత్ 11వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన అద్భుతమైన సిక్స్ ద్వారా T20 క్రికెట్లో తన 500 సిక్సర్ల రికార్డును పూర్తి చేశాడు. 432 మ్యాచ్‌ల్లో 419 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. అతను ఇప్పుడు ఇండియా, ఆసియా నుంచి T20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట్స్‌మన్, ప్రపంచంలో ఐదవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ఇది కూడా చదవండి:
షూటర్ పాలక్‌కు ఒలింపిక్ బెర్త్
మరిన్ని క్రీడా వార్తల కోసం