Share News

IPL 2024: నేటి SRH vs CSK మ్యాచ్‌లో గెలుపేవరిది..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:22 AM

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో కీలకమైన 18వ మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన సన్ రైజర్స్ సొంత మైదానంలో ఇది జరగనున్న క్రమంలో అందరి దృష్టి కూడా ఈ మ్యాచ్‌పైనే ఉంది.

IPL 2024: నేటి SRH vs CSK మ్యాచ్‌లో గెలుపేవరిది..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో కీలకమైన 18వ మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన సన్ రైజర్స్ సొంత మైదానంలో ఇది జరగనున్న క్రమంలో అందరి దృష్టి కూడా ఈ మ్యాచ్‌పైనే ఉంది. మరోవైపు గత మ్యాచ్ కూడా చెన్నై ఓడింది. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని రెండు జట్లు చూస్తు్న్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పవచ్చు.

అయితే చెన్నై జట్టు(CSK) ఐపీఎల్ 2024లో మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌లలో CSK నాలుగు విజయాలు నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో SRH జట్టు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నైని ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి. మరోవైపు గూగుల్ గెలుపు అంచనా ప్రకారం ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 53 శాతం గెలిచే అవకాశం ఉండగా, హైదరాబాద్ జట్టుకు 47 శాతం ఉందని తెలిపింది.


సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు(Sunrisers Hyderabad)లో మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)లో జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణ, మహిష్ తిక్షణ కలరు.


ఇది కూడా చదవండి:

పరుగుల వరద ఖాయమేనా?

SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 11:26 AM