Share News

IPL 2025: ఐపీఎల్ 2025 గురించి కీలక అప్‌డేట్.. ఈసారి వేలం కోసం విదేశాలకు

ABN , Publish Date - Oct 21 , 2024 | 07:28 PM

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే మెగా వేలం నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలోనే మెగా వేలం తేదీ, స్థలం గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2025: ఐపీఎల్ 2025 గురించి కీలక అప్‌డేట్.. ఈసారి వేలం కోసం విదేశాలకు
ipl 2025 mega auction

ఐపీఎల్ 2025(ipl 2025) వేలం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో దీనికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5లోగా మొత్తం పది జట్లు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించాలి. తద్వారా ఏ ఆటగాళ్లను రిటైన్ చేశారో, ఎవరిని విడుదల చేశారో తెలుస్తుంది. అయితే ఈ వేలానికి సంబంధించిన తేదీ, స్థలం గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈసారి విదేశాల్లో మెగా వేలం నిర్వహించనున్నారు.


గతంలో

ఓ నివేదిక ప్రకారం మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈసారి వేలం రెండు రోజుల పాటు జరగనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలను పూర్తి చేసేందుకు బీసీసీఐ ఇప్పటికే ఓ బృందాన్ని కూడా రియాద్‌కు పంపించింది. ఈ మెగా వేలం కోసం బీసీసీఐ దుబాయ్, సింగపూర్, లండన్‌లను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజా నివేదిక ప్రకారం మెగా వేలం సౌదీ అరేబియాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


ఆస్ట్రేలియా టూర్ కూడా..

మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ 26 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో వేలం ఉంటుంది. విశేషం ఏమిటంటే.. టీమిండియా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ పెర్త్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో వేలం కూడా జరిగితే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.


అనేక ఎంపికలు

రియాద్‌, జెడ్డాలలో కూడా ఈ వేలం నిర్వహించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో BCCI అనేక ఎంపికలను పరిశీలిస్తోంది. ఖచ్చితమైన స్థలం త్వరలో ఖరారు కానుంది. మెగా వేలం భారత్‌లో జరగనందున బీసీసీఐ త్వరలో తేదీ, వేదికను ప్రకటించాల్సి ఉంటుంది. అందువల్ల అన్ని జట్లకు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. తద్వారా జట్లు కూడా దానికి అనుగుణంగా తమ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాయి. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో ఐపీఎల్‌కు సంబంధించి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది.


ఇవి కూడా చదవండి:

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..

Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో వ్యాపారం.. నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం..


Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..


Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 21 , 2024 | 07:31 PM