Watch Video: ఒకే ఓవర్లో 30 పరుగులు.. ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మాస్ విధ్వంసం చూశారా?
ABN , Publish Date - Apr 21 , 2024 | 11:36 AM
శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స హైదరాబాద్ మరోసారి భారీ స్కోరు సాధించింది. డీసీ బౌలర్లను ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (46) ఊచకోత కోశారు.
శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (DC vs SRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స హైదరాబాద్ మరోసారి భారీ స్కోరు సాధించింది. డీసీ బౌలర్లను ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (46) ఊచకోత కోశారు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ దీటుగా స్పందించింది (IPL 2024).
ఆరంభంలో ఢిల్లీ స్వల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది. 25/2తో ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. అయితే జేక్ ఫ్రేజర్ ( Jake Fraser) సంచలన ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ బౌలర్లను వణికించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా 4,4,6,4,6,6 కొట్టి ఏకంగా 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా జేక్ దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఢిల్లీ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 18 బంతుల్లో 65 పరుగులు చేసిన జేక్ అవుట్ కావడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది.
చివరకు నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 రన్స్‌కు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆరంభ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ట్రావిస్ హెడ్ (Travis Head), అభిషేక్ శర్మ విధ్వంసం కారణంగా సన్‌రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో ఏకంగా 125 పరుగులు చేసింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి..
IPL 2024: 65 సిక్స్‌లు, 53 ఫోర్లు.. చివరి ఓవర్‌లో ధోనీ విధ్వంసం..
SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ని మడతపెట్టే సమయంలో.. సన్‌రైజర్స్ సాధించిన రికార్డులు ఇవే!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..