IPL 2024: 65 సిక్స్‌లు, 53 ఫోర్లు.. చివరి ఓవర్‌లో ధోనీ విధ్వంసం..
ABN , Publish Date - Apr 21 , 2024 | 10:06 AM
MS Dhoni Records in IPL: ఇప్పుడంతా ఐపీఎల్(IPL) మేనియా నడుస్తోంది. బ్యాటర్ల వీరవిహారంతో క్రికెట్(Cricket) ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఐపీఎల్ 16 సీజన్ల వరకు ఒక ఎత్తు.. 17వ సీజన్ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది మ్యాచ్‌లు జరుగుతున్న తీరు. అవును.. ప్రతి జట్టులోని ప్లేయర్స్ ఎక్కడా తగ్గడం లేదు.
MS Dhoni Records in IPL: ఇప్పుడంతా ఐపీఎల్(IPL) మేనియా నడుస్తోంది. బ్యాటర్ల వీరవిహారంతో క్రికెట్(Cricket) ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఐపీఎల్ 16 సీజన్ల వరకు ఒక ఎత్తు.. 17వ సీజన్ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది మ్యాచ్‌లు జరుగుతున్న తీరు. అవును.. ప్రతి జట్టులోని ప్లేయర్స్ ఎక్కడా తగ్గడం లేదు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విజృంభిస్తూ.. అభిమానులను సీట్లో కూర్చోనివ్వకుండా చేసేస్తున్నారు. ఇక ప్లేయర్స్ అందరూ ఒకటైతే.. మహేంద్ర సింగ్ ధోనీ లెక్కలు మరొకటి. సింగ్ ఈజీ కింగ్ అన్నట్లుగా.. ధోనీ(MS Dhoni) బ్యాటింగ్ లెక్కలు అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
మొత్తం ఐపీఎల్ సీజన్లలో ధోనీ బ్యాటింగ్ తీరు.. మహీ బాదిన సిక్సర్లు, ఫోర్లు.. బ్యాటింగ్ చేసిన టైమింగ్ చూస్తే వావ్ అని నోరెళ్లబెట్టాల్సిందే. అవును, ధోనీకి సాధారణంగానే గొప్ప ఫినిషర్ అనే పేరు ఉంది. ఆ ఫినిషింగ్ లెక్కలే అవాక్కయ్యేలా చేస్తున్నాయి. టీ20 మ్యాచ్‌లో 20 ఓవర్లు ఉంటాయి. ధోనీ దాదాపుగా చివరి ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడు. అలా వచ్చిన సింగ్.. ఊరుకుంటాడా.. సింహం జూలు విదిల్చినట్లుగా తన బ్యాట్ విదిల్చి సిక్సర్ల మోత మోగిస్తాడు.
ఇదికూడా చదవండి:
ఇదీ రన్స్ లెక్క..
ధోని కేవలం చివరి ఓవర్లో వచ్చిన కొట్టిన రన్స్ ఎంతో తెలుసా? 772 పరుగులు చేశాడు. ఇందులో సిక్సర్లే ఎక్కువ. 65 సిక్సర్లు, 53 ఫోర్లతో వీరవిహారం చేశాడు మహేంద్ర సింగ్ ధోని. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 నడుస్తోంది. ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ.. రెచ్చిపోయి ఆడాడు. కేవలం 9 బంతులు ఆడిన ఎంఎస్‌డి.. 2 భారీ సిక్స్‌లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 బంతుల్లో 4 భారీ సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. ఇలా చివరి ఓవర్లో కేకలు పుట్టిస్తూ.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు ధోనీ.
ఇదికూడా చదవండి:
ధోనీకి సరిలేరెవ్వరూ..
కేవలం 20వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్య 65. ఐపీఎల్ చరిత్రలో ధోనీ తప్ప మరే బ్యాట్స్‌మెన్ కూడా 20వ ఓవర్లో వచ్చి 50కి మించి సిక్సర్లు కొట్టలేదు. కానీ ఎంఎస్‌డీ మాత్రం ఇప్పటికే 65 సిక్సర్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తం ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్‌లో వచ్చి 313 బాల్స్ ఫేస్ చేసిన ధోనీ.. 65 సిక్సర్లు, 53 ఫోర్లు కొట్టాడు. 246.64 స్ట్రైక్ రేట్‌తో 772 పరుగులు చేశాడు.
ఇదికూడా చదవండి:
ఈ సీజన్‌లో రచ్చే..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ధోనీ చివరి ఓవర్‌లో మొత్తం 16 బంతులు ఫేస్ చేశాడు. ఈ సీజన్‌లో 6 సిక్సర్లు, 4 ఫోర్టు కొట్టాడు ధోనీ. 356.25 స్ట్రైక్ రేట్‌తో 57 పరుగులు చేశాడు. ఇలా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ.. అద్భుతమైన గేమ్ ఫినిషర్‌గా ధోనీ నిలుస్తున్నాడు.