Share News

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో మను బాకర్ సంచలనం.. రెండో పతకం సాధించిన షూటర్!

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:20 PM

పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ సంచలనం సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ఘన చరిత్ర సృష్టించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన మను బాకర్. తాజాగా మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో మను బాకర్ సంచలనం.. రెండో పతకం సాధించిన షూటర్!
Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) మను బాకర్ (Manu Bhaker) సంచలనం సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ఘన చరిత్ర సృష్టించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన మను బాకర్. తాజాగా మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌ (Sarabjot Singh)తో కలిసి కాంస్య పతకం (Bronze medal) గెలిచింది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో దక్షిణ కొరియా ద్వయం జుయీ లీ- వోన్షోలీపై మను-సరబ్‌జోత్ జోడీ 16-10తో విజయం సాధించింది (Manu Bhaker Record).


తాజా పతకంతో మను అరుదైన ఘనతను సాధించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న భారత అథ్లెట్‌గా నిలిచింది. అలాగే మొత్తంగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మూడో భారత అథ్లెట్‌గా ఘనత సాధించింది. రెజ్లర్‌ సుశీల్, షట్లర్‌ సింధు గతంలో రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించారు. స్వాతంత్య్రానికి ముందు భారత్ తరఫున నార్మన్ ప్రిచార్ట్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించాడు. 1900 ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో నార్మన్ రజతాలు దక్కించుకున్నాడు. అయితే నార్మన్ బ్రిటన్‌కు చెందిన పౌరుడు.


మనుతో కలిసి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యం దక్కించుకున్న సరబ్‌జోత్ సింగ్‌‌కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్. వీరిద్దరూ కలిసి దక్షిణ కొరియా ద్వయాన్ని నిలువరించారు. 13 సిరీస్‌లు పాటు సాగిన ఈ పోరు ఉత్కంఠ రేపింది. మొదట్లో దక్షిణ కొరియా పైచేయి సాధించింది. ఆ తర్వాత భారత షూటర్లు పుంజుకున్నారు. కాంస్య పతకం సాధించారు.

ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా హౌస్.. స్పెషల్ వీడియో పంచుకున్న నీతా అంబానీ!


Suryakumar Yadav: సూర్యకుమార్ తాత్కాలిక కెప్టెనే.. అసలు నాయకుడు అతడే!


Rohan Bopanna : ఆఖరి మ్యాచ్‌ ఆడేశా


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2024 | 06:33 PM