Share News

MS Dhoni: కోహ్లీతో అనుబంధానికి పేరేంటో తెలియదు.. ఇప్పటికీ అతడే అత్యుత్తమ బ్యాటర్..: ధోనీ

ABN , Publish Date - Sep 01 , 2024 | 06:26 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ధోనీ అంటే ప్రత్యేక అభిమానం. ధోనీ సారథ్యంలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగాడు. ధోనీ అంటే కోహ్లీకి ఇప్పటికీ అదే అభిమానం, గౌరవం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ధోనీ ఓ ఇంటర్వ్యూలో కోహ్లీతో అనుబంధం గురించి మాట్లాడాడు.

MS Dhoni: కోహ్లీతో అనుబంధానికి పేరేంటో తెలియదు.. ఇప్పటికీ అతడే అత్యుత్తమ బ్యాటర్..: ధోనీ
Dhoni Talks about Kohli

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ధోనీ (MS Dhoni) అంటే ప్రత్యేక అభిమానం. ధోనీ సారథ్యంలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగాడు. ధోనీ అంటే కోహ్లీకి ఇప్పటికీ అదే అభిమానం, గౌరవం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ధోనీ ఓ ఇంటర్వ్యూలో కోహ్లీతో అనుబంధం గురించి మాట్లాడాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికీ కోహ్లీనే అత్యుత్తమ క్రికెటర్ అని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Dhoni Talks about Kohli).


``కోహ్లీకి, నాకు మధ్య వయసు వ్యత్యాసం ఉంది. నేను అతడికి సోదరుడినా, సహచరుడినా.. మా బంధానికి మీరు ఏ పేరు పెట్టారో నాకు తెలియదు. మేం 2008-09 నుంచి చాలా ఏళ్లు టీమిండియా తరఫున కలిసి ఆడాం. మైదానంలో మేమిద్దరం సహచరులం. ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ కోహ్లీయే అత్యుత్తమ బ్యాటర్`` అని ధోనీ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరినీ కలిపి అభిమానులు ``మహిరాట్`` (Mahirat) అని ప్రేమగా పిలుచుకుంటారు. కెరీర్ తొలినాళ్లలో ధోనీ తనను బాగా ప్రోత్సహించాడని, తనపై నమ్మకం ఉంచి ఎక్కువ అవకాశాలు ఇచ్చాడని చాలా ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపాడు.


ఇటీవల ఓ పాక్ క్రికెటర్ కూడా కోహ్లీ కోసం ధోనీ నిలబడిన విధానం గురించి వెల్లడించాడు. కోహ్లీని జట్టు నుంచి తప్పించడానికి ధోనీ అంగీకరించలేదని, కోహ్లీని తప్పిస్తానంటే వేరే కెప్టెన్‌ను వెతుక్కోమని ధోనీ హెచ్చరించాడని ఆ పాక్ క్రికెటర్ తెలిపాడు. నిజానికి స్వభావ రీత్య కోహ్లీ, ధోనీ భిన్న ధృవాలు. ధోనీ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటే, కోహ్లీ అందుకు భిన్నంగా ఎమోషనల్‌గా, దూకుడుగా ఉంటాడు. అలాంటి వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం చాలా ప్రత్యేకమైనది.

ఇవి కూడా చదవండి..

Watch Video: గల్లీ క్రికెటర్లు కూడా ఈ క్యాచ్ వదిలేయరేమో.. పాకిస్తాన్ క్రికెటర్ల ఫీల్డింగ్‌పై నెట్టింట విమర్శలు..


Champions Trophy: టీమిండియాను పాకిస్తాన్‌కు పంపకూడదు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!


Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2024 | 09:09 PM