Share News

Brian Lara: సచిన్, నేను కాదు.. అతడే ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్.. మాజీ ఆటగాడిపై బ్రియాన్ లారా ప్రశంసలు!

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:10 AM

సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా.. సమకాలీన క్రికెట్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన గొప్ప క్రికెటర్లు. తమ అద్భుత ఆటతీరుతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వీరిద్దరూ ఎన్నో రికార్డులను తమ పేర లిఖించుకున్నారు. వారు నెలకొల్పిన చాలా రికార్డులను ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు.

Brian Lara: సచిన్, నేను కాదు.. అతడే ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్.. మాజీ ఆటగాడిపై బ్రియాన్ లారా ప్రశంసలు!
Sachin Tendulkar, Brian Lara

సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar ), బ్రియాన్ లారా (Brian Lara).. సమకాలీన క్రికెట్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన గొప్ప క్రికెటర్లు. తమ అద్భుత ఆటతీరుతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వీరిద్దరూ ఎన్నో రికార్డులను తమ పేర లిఖించుకున్నారు. వారు నెలకొల్పిన చాలా రికార్డులను ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. టెస్టులు (15,921), వన్డేల్లో (18,426) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ నిలవగా, టెస్టులు (400), ఫస్ట్ క్లాస్ క్రికెట్ (501)లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా లారా రికార్డు సృష్టించాడు. ఈ దిగ్గజాలిద్దరూ ఒకరినొకరు విపరీతంగా అభిమానించుకుంటారు.


లారా ప్రస్తుతం తన ఆటో బయోగ్రఫీ రాస్తున్నాడు. ఆ పుస్తకంలో తను రాసిన ఓ ఆసక్తికర విషయం గురించి లారా తాజాగా ప్రస్తావించాడు. ``నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కార్ల్ హూపర్. విండీస్ దిగ్గజ క్రికెటర్ అయిన హూపర్‌ చాలా సహజ సిద్ధమైన ప్రతిభావంతుడు. సచిన్, నేను అతని దగ్గరకు కూడా రాలేం. అతడు దాదాపు 50 సగటుతో పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఉంటూ అతడు బ్యాటర్‌గా రాణించాడు. వివియన్ రిచర్డ్స్‌కు నా కంటే హూపర్ అంటేనే ఇష్టం`` అని లారా పేర్కొన్నాడు (Talented Player Of All Time).


టెస్ట్‌ల్లో తన 400 రికార్డును బద్దలు కొట్టగల యువ ఆటగాళ్ల గురించి లారా ఇటీవల మాట్లాడాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లైన జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్, భారత్‌కు చెందిన శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్.. అనువైన పరిస్థితులు ఉన్న రోజున తన రికార్డును బద్దలుకొట్టగలరని లారా అభిప్రాయపడ్డాడు. మంచి టెక్నిక్‌తో దూకుడుగా ఆడే స్వభావం కలిగిన వీరికి తన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: కోహ్లీతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది గంభీరే: అమిత్ మిశ్రా


Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2024 | 11:10 AM