Share News

Virat Kohli: కోహ్లీతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది గంభీరే: అమిత్ మిశ్రా

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:33 AM

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దడానికి గౌతమ్ గంభీర్ ప్రయత్నించాడని, కోహ్లీ సైలెంట్‌గా ఉండిపోయాడని టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వ్యాఖ్యానించాడు.

Virat Kohli: కోహ్లీతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది గంభీరే: అమిత్ మిశ్రా
Virat Kohli, Gautam Gambhir

ఐపీఎల్ (IPL) మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ (Virat Kohli)తో తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దడానికి గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రయత్నించాడని, కోహ్లీ సైలెంట్‌గా ఉండిపోయాడని టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) వ్యాఖ్యానించాడు. 2023లో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌ సందర్భంగా అప్పటి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గంభీర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ కోహ్లీ మధ్య వాగ్వాదం చెలరేగింది. తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే 2024 ఐపీఎల్ సమయంలో ఇద్దరూ కౌగిలించుకుని, మాట్లాడుకుని ఆ వివాదానికి ముగింపు పలికారు.


``గంభీర్ గురించి నేను ఓ మంచి విషయం చెప్పగలను. కోహ్లీతో చెలరేగిన వివాదాన్ని పరిష్కరించడానికి గంభీర్ ముందుకు వెళ్లాడు. కోహ్లీ దగ్గరకు వెళ్లి.. ``బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు?`` అని అడిగాడు. అప్పుడు కోహ్లీ మాటలు కలిపాడు. గంభీర్ కంటే ముందుగానే కోహ్లీ వెళ్లి ఉండాల్సింది. ``గౌతీ భాయ్.. ఈ వివాదాన్ని అంతం చేద్దాం`` అని ఉండాల్సింది. కానీ, కోహ్లీ అలా చేయడు. స్టార్ అయిన తర్వాత కోహ్లీలో చాలా మార్పు చూశా. కానీ, రోహిత్ శర్మలో మాత్రం మార్పు రాలేదు`` అని అమిత్ చెప్పాడు.


``నేను జట్టును వీడి చాలా కాలం అయింది. అయినా ఎక్కడ కనబడినా రోహిత్ నాతో నవ్వుతూ మాట్లాడతాడు. పెద్ద స్టార్ అయిన రోహిత్ ఏమనుకుంటాడో అని నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఉంటాడు. కానీ, కోహ్లీ అలా కాదు. మేం చాలా ఏళ్లుగా మాట్లాడుకోవడం లేదు. మనకు చాలా పేరు, డబ్బు వచ్చింది కాబట్టి, ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించే మన దగ్గరకు వస్తారని కొందరు అనుకుంటారు`` అంటూ అమిత్ మిశ్రా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇవి కూడా చదవండి..

యూరో కింగ్‌ స్పెయిన్‌


David Warner: డేవిడ్ వార్నర్‌కు భారీ షాక్.. ఆ కల చెదిరిందిగా!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2024 | 10:31 AM