Share News

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..

ABN , Publish Date - Jul 27 , 2024 | 08:00 AM

పారిస్ ఒలింపిక్స్‌ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్‌లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..
Satwiksairaj Rankireddy

పారిస్ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympic 2024) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్‌లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు. కొన్ని విభాగాలకు సంబంధించి భారత్ తరపున ప్రాతినిధ్యం లేదు. ఈసారి కనీసం ఐదు బంగారు పతకాలతో కలిపి రెండంకెల సంఖ్యను దాటాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌(Badminton)లో మూడు పతకాలు, ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు నుంచి నాలుగు, ఇతర క్రీడలకు సంబంధించి ఒకటి నుంచి రెండు పతకాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే భారత్ తరపున పాల్గొంటున్న క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించడంతో పాటు.. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత ఒలింపిక్స్ సంఘం అన్ని చర్యలు తీసుకుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సైతం క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఒక బంగారు, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించగా.. ఈసారి మాత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో పతకం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి.

Olympic Games : ఆరంభ సంబరం పారిస్‌ పరవశం


కోనసీమ కుర్రాడు..

అమలాపురం ప్రాంతానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టితో కలిసి ఆడనున్నాడు. గత టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ బృందం పతకం సాధిస్తుందని ఆశలు పెట్టుకున్నప్పటికీ సాధ్యంకాలేదు. గత రెండేళ్లుగా ఈ జోడి బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మంచి ఫామ్ కొనసాగిస్తోంది. ఈ ఏడాది జరిగిన నాలుగు అంతర్జాతీయ టోర్నీల్లో ఈ బృందం అదరగొట్టింది. ఫ్రెంచ్, థాయిలాండ్ ఓపెన్‌లో చాంఫియన్స్‌గా నిలవగా.. మలేషియా, ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచారు. దీంతో ఈ జోడి పారిస్ ఒలింపిక్స్‌లో తప్పకుండా పతకం సాధించే అవకాశాలున్నాయని క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

T20 World Champion : కొత్త.. కొత్తగా


నేపథ్యం..

అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ చిన్నప్పటినుంచి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి కాశీవిశ్వనాధ్ వ్యాయమ ఉపాధ్యాయుడు కావడంతో కుమారుడికి క్రీడలపై ఉన్న మక్కువ తెలుసుకుని.. తనతో పాటు గ్రౌండ్‌కు తీసుకెళ్లేవారు. బ్యాడ్మింటన్‌పై ఆసక్తితో చిన్నతనంలోనే బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకున్న సాత్విక్‌ను ఆయన తండ్రి హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ శిక్షణ ఇప్పించారు. సింగిల్స్‌ కంటే డబుల్స్‌లో అయితే సాత్విక్ రాణించగలడని గుర్తించిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ మహారాష్ట్రకు చెందిన చిరాగ్‌తో కలిసి డబుల్స్‌ టీమ్‌ను తయారుచేశారు. ఈ ఇద్దరి జోడి సక్సెస్ కావడంతో అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ తరపున బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ జోడి ప్రాతినిధ్యం వహిస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌లో జులై 27 శనివారం బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్‌ మ్యాచ్‌లలో ఫ్రెంచ్‌కు చెందిన కార్వీ లుకాస్, రోనన్‌ జోడితో తలపడనుంది.


వేలంలో ద్రవిడ్‌ కొడుక్కి రూ.50 వేలు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 08:00 AM