Paris Olympics: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు భారత్..
ABN , Publish Date - Aug 01 , 2024 | 06:37 PM
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పురుషుల డబుల్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో పోరాడి ఓడగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిస్తే లక్ష్యసేన్ సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ప్రణయ్ హెచ్ ఎస్‌పై 21-12, 21-6 తేడాతో వరుస రెండు సెట్లను గెలుచుకున్నాడు. ఇద్దరు భారత ఆటగాళ్లే ఫ్రీక్వార్టర్స్‌లో తలపడ్డారు.
పతకంపై ఆశలు..
బ్యాడ్మింటన్‌లో రెండు నుంచి మూడు పతకాలు వస్తాయని భారత్ ఆశలు పెట్టుకుంది. అయితే పురుషుల డబుల్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో రెండు పతకాలపై ఆశలు పెట్టుకుంది. షూటింగ్‌లో ఇప్పటికే మూడు పతకాలు రాగా.. బ్యాడ్మింటన్‌లోనూ రెండు పతకాలు రావొచ్చని క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తు్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లో పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గత ఒలింపిక్స్‌లో..
గత టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది. తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లో ఓడిపోవడంతో కాంస్య పతకం సాధించింది. ఈసారి మాత్రం బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు వస్తాయని ఇండియా ఆశలు పెట్టుకుంది. రేపు సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్, ఎల్లుండి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Sports News and Latest Telugu News