Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ దూరం
ABN , Publish Date - Apr 14 , 2024 | 11:41 AM
గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ సంజయ్ భంగార్ పేర్కొన్నాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు (Punjab Kings) తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ సంజయ్ భంగార్ (Sanjay Bhangar) పేర్కొన్నాడు. భుజం గాయం కారణంగానే ధవన్ దూరం కానున్నట్టు ఆయన స్పష్టం చేశాడు.
Viral Video: బస్ డ్రైవర్‌గా మారిన రోహిత్ శర్మ
నిజానికి.. ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో ధవన్ ఆడాల్సింది. కానీ.. అతడు చివరి నిమిషంలో డ్రాప్ అయ్యాడు. భుజానికి తగిలిన గాయం తీవ్రం కావడంతో, పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పడంతో.. తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్లతో జరగబోయే మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండదు. ఇవి రెండు కీలకమైన మ్యాచ్‌లే. వాటి ధవన్ లాంటి ఆటగాడు దూరం కావడం.. పంజాబ్‌కు గట్టి దెబ్బ తగిలినట్టేనని చెప్పుకోవచ్చు.
IPL 2024: రాజాస్థాన్ చేతిన ఓడిన పంజాబ్.. ప్రీతి జింటా రియాక్షన్ చుశారా?
ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా సత్తా చాటుకోకపోవడం వల్ల.. ఆ స్వల్ప స్కోరుకే చాపచుట్టేయాల్సి వచ్చింది. లక్ష్య ఛేదనలో భాగంగా.. రాజస్థాన్ కూడా తడబడింది. ఒకానొక దశలో రాజస్థాన్ ఓడిపోతుందని అంతా భావించారు. కానీ.. హెట్‌మైర్ (Shimron Hetmyer) మెరుపులు మెరిపించి, తన జట్టుని గెలిపించాడు. అతని పుణ్యమా అని.. 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి, రాజస్థాన్ గెలుపొందింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి