Rishabh Pant: బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేసిన రిషభ్ పంత్.. కారణం ఏంటో చెప్పిన సెంచరీ వీరుడు..
ABN , Publish Date - Sep 23 , 2024 | 01:57 PM
కారు ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగు పెట్టిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో చక్కని ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.
కారు ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగు పెట్టిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో (Ind Vs Ban Test Match) చక్కని ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. 13 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో తనదైన శైలిలో 109 పరుగులు చేశాడు. పంత్ బ్యాటింగ్ చేస్తుండగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. తన బ్యాటింగ్ సందర్భంగా బంగ్లాదేశ్ ఫీల్డింగ్ (Fielding) సెట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
``ఇద్దరూ ఒక దగ్గరే ఫీల్డింగ్ చేస్తున్నారు. మిడ్ వికెట్‌లో ఎవరూ లేరు. ఒకరు అక్కడకు వెళ్లండి`` అని బంగ్లా ఫీల్డర్లకు పంత్ సూచించాడు. దీంతో బంగ్లా కెప్టెన్ ఒక ఫీల్డర్‌ను మిడ్ వికెట్ ఏరియాకు పంపించాడు. పంత్ మాటలు స్టంప్ మైక్రోఫోన్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి కారణం ఏంటో మ్యాచ్ అనంతరం పంత్ వివరించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాటల ప్రభావంతోనే తాను బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేసినట్టు చెప్పాడు.
``నేను తరచుగా అజయ్ జడేజాతో మాట్లాడుతుంటారు. క్రికెట్‌లో క్వాలిటీ పెంచాలని అజయ్ ఎప్పుడూ అంటుంటాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా క్వాలిటీ క్రికెట్ ఆడాలని చెబుతుంటాడు. బంగ్లాదేశ్ ఫీల్డర్లు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. మిడ్ వికెట్‌లో ఎవరూ లేరు. అదే విషయం వాళ్లకు చెప్పా. అంతకు మించి ఏమీ లేదు`` అంటూ పంత్ వివరించాడు. పంత్ చెప్పగానే బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో ఒక ఆటగాడిని మిడ్ వికెట్ ఏరియాకు పంపించాడు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: చెన్నై టెస్ట్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన.. విరాట్ కోహ్లీ ఎలా అభినందించాడో చూడండి..
MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..
Rohit Sharma: గిల్‌పై రోహిత్ శర్మ ఫ్రాంక్.. కోహ్లీ చెప్పిన మాటతో నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్..
Watch Video: మలింగలా బౌలింగ్ చేస్తున్నావు.. షకిబ్ బంతులపై కోహ్లీ కామెంట్.. వీడియో వైరల్..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..