Share News

Virat Kohli: చెన్నై టెస్ట్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన.. విరాట్ కోహ్లీ ఎలా అభినందించాడో చూడండి..

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:04 PM

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయ ఢంకా మోగించింది. ఏకంగా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడమే కాకుండా, ఆరు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు.

Virat Kohli: చెన్నై టెస్ట్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన.. విరాట్ కోహ్లీ ఎలా అభినందించాడో చూడండి..
Virat Kohli praises Ashwin

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో (Ind vs Ban) టీమిండియా విజయ ఢంకా మోగించింది. ఏకంగా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడమే కాకుండా, ఆరు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు. ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు. దీంతో అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


తాజా, మాజీ ఆటగాళ్లు అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడంటూ పొగడుతున్నారు. మ్యాచ్ సమయంలోనే టీమిండియా ఆటగాళ్లు అశ్విన్‌ను ప్రశంసించారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలోనే అశ్విన్ ఎదుట తన తలను వంచి అభివందనం చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో ఇన్నింగ్స్ 58వ ఓవర్ సందర్భంగా బంగ్లా ఆటగాడు మెహ్దీ హసన్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అది అశ్విన్‌కు ఐదో వికెట్. టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ ఐదో వికెట్ తీయడం ఇది 37వ సారి. దీంతో ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రికార్డును బద్దలుగొట్టాడు.


షేన్ వార్న్ రికార్డు బద్దలుగొట్టిన సందర్భంగా అశ్విన్‌ను కోహ్లీ ఇలా గౌరవించాడు. కాగా, చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ సెంచరీ సాధించాడు. జడేజా (86)తో కలిసి బంగ్లా బౌలర్లకు ఎదురు నిలిచాడు. టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లా వెన్ను విరిచాడు. టీమిండియాకు 280 పరుగుల విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..


Rohit Sharma: గిల్‌పై రోహిత్ శర్మ ఫ్రాంక్.. కోహ్లీ చెప్పిన మాటతో నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్..


Watch Video: మలింగలా బౌలింగ్ చేస్తున్నావు.. షకిబ్‌ బంతులపై కోహ్లీ కామెంట్.. వీడియో వైరల్..


Ind vs Ban: బంగ్లాదేశ్ మరో తప్పిదం.. ఐసీసీ నుంచి జరిమానా తప్పదా..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2024 | 12:04 PM