Share News

T20 Worldcup: మ్యాచ్ అనంతరం దిగ్గజాల భావోద్వేగం.. రోహిత్, విరాట్ సంతోషం చూశారా?

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:35 AM

దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. కోట్లాది మంది అభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ టీ-20 కెరీర్లకు స్వస్తి పలికారు.

T20 Worldcup: మ్యాచ్ అనంతరం దిగ్గజాల భావోద్వేగం.. రోహిత్, విరాట్ సంతోషం చూశారా?
Virat Kohli and Rohit Sharma

దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా (Teamindia) ప్రపంచకప్‌ను ముద్దాడింది. కోట్లాది మంది అభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై (Ind vs SA) 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా దిగ్గజాలైన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) తమ టీ-20 కెరీర్లకు స్వస్తి పలికారు. అంతర్జాతీయ టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యారు.


ఈ టోర్నీలో కెప్టెన్‌గానే కాదు.. బ్యాటర్‌గా కూడా రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో విఫలమైనా అంతకు ముందు కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌లు ఆడి విజయాలు అందించాడు. ఇక, టోర్నీ అంతా విఫలమైన కోహ్లీ.. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో జూలు విదిల్చాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైన సమయంలో సమయోచితంగా ఆడి 72 పరుగులు చేశాడు. ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు. కుర్రాళ్లతో నిండిన టీమిండియాలో ఈ వెటరన్లు కూడా తమ పాత్రను సమర్థవంతంగా పోషించారు.


ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయం అనంతరం రోహిత్, కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి జాతీయ జెండా ధరించి ట్రోఫీ పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు.. టీమిండియా విజయంపై ఢిల్లీ, యూపీ పోలీసుల వినూత్న ట్వీట్లు!


T20 Worldcup: ఓటమి తప్పదనుకునే దశలో హార్దిక్ ఏం చేశాడో చూడండి.. క్లాసెన్ అవుట్ టర్నింగ్ పాయింట్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 30 , 2024 | 11:35 AM